Satyadev: ఆహా ఓటీటీలోకి జీబ్రా సినిమా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన సత్యదేవ్.. ఏంటంటే..

Satyadev: ఆహా ఓటీటీలోకి జీబ్రా సినిమా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన సత్యదేవ్.. ఏంటంటే..


టాలీవుడ్ హీరో సత్యదేవ్, కన్నడ సూపర్ స్టార్ డాలీ ధనంజయ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ మూవీ జీబ్రా. ఇటీవలే నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. అలాగే సత్యరాజ్, సత్య, జెన్నిఫర్ పిషినాటో కీలకపాత్రలు పోషించారు. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించగా.. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ జానర్లో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో డిసెంబర్ 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో ఆహా ఓటీటీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకునే వాళ్లల్లో లక్కీ డ్రా తీసి అందులో వచ్చిన వాళ్లకు సత్యదేవ్ ఫేవరేట్ వాచ్, గ్లాసెస్ బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అవి నేరుగా సత్యదేవ్, సునీల్ చేతుల మీదుగా వారికి అందిస్తామని ప్రకటించారు. నిజానికి ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే కాస్త బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సంవత్సరానికి రూ.999తో ఆహా గోల్డ్ తీసుకుంటే తెలుగు సినిమాలు, సిరీస్ లతోపాటు తమిళ్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

అంతేకాకుండా కొన్ని సినిమాలను రెండు రోజుల ముందే చూడొచ్చు. అలాగే కంటెంట్ సైతం 4K క్వాలిటీలో డాల్బీ సౌండ్ సిస్టంతో చూడొచ్చు. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకునేవారికి ఇప్పుడు సత్యదేవ్ వాచ్, గ్లాసెస్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. మరీ ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆహా గోల్డ్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *