Saraswati Plant: ఈ ఆకు రోజుకు ఒక్కటి తిన్నా జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది..

Saraswati Plant: ఈ ఆకు రోజుకు ఒక్కటి తిన్నా జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది..


ఈ సృష్టిలో ఎన్నో మొక్కలు ఉన్నాయి. ప్రతిరోజూ చాలా మొక్కలను చూస్తూ ఉంటాం. ప్రతీ ఒక్క ఉపయోగకరమైనదే. కానీ వాటి విలువ గురించి మనకు తెలీదు. పూర్వం ఆయుర్వేదంలో అనేక మందుల తయారీలో వివిధ రకాల మొక్కలను ఉయోగించేవారు. అయితే కొన్ని రకాల మొక్కలను మాత్రమే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వాటిల్లో సరస్వతి మొక్క కూడా ఒకటి. ఈ మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా పలు రకాల చికిత్సలకు సరస్వతీ మొక్కలను ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల్లో ఎన్నో పోషకాలు కూడా నిండి ఉంటాయి. ప్రతి రోజూ ఒక్క ఆకు తిన్నా.. అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచడంలో ఈ మొక్క ఆకులు ఎంతో చక్కగా సహాయ పడతాయి. అంతే కాకుండా నత్తి నత్తిగా మాట్లాడేవారు ఈ ఆకులు తింటే నత్తి తగ్గి.. చక్కగా మాట్లాడతారు. మతి మరుపు కూడా తగ్గుతుంది. చదువు బాగా వస్తుందని పిల్లలకు ఈ మొక్క ఆకులను పెడుతూ ఉంటారు. మరి ఈ ఆకులు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మాటలు వస్తాయి:

కొంత మంది చిన్న పిల్లలు సరిగా మాట్లాడలేరు. ఇలాంటి పిల్లలకు ఆకులను పొడిలా చేసి పెట్టినా, ఆకుల రసాన్ని పట్టించినా, ఆకులు తిన్నా మంచి ఫలితం ఉంటుంది. మాటలు త్వరగా వస్తాయి. సరస్వతీ లేహ్యాన్ని అందించినా పిల్లలకు చాలా మంచిది. బుద్ధి బలం కూడా పెరుగుతుంది.

మెదడు యాక్టీవ్:

సరస్వతీ ఆకులు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. బ్రెయిన్ సరిగా వర్క్ చేయని వారికి ఈ సరస్వతీ ఆకులను ఇస్తే ఎంతో చక్కగా పని చేస్తుంది. ఈ ఆకులను మెమరీ బూస్టర్‌గా కూడా వాడతారు. మతిమరుపు కూడా తగ్గి జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. ఈ ఆకులు తినడం వల్ల మెదడు, నరాలు సరిగ్గా పని చేస్తాయి.

ఇవి కూడా చదవండి

నత్తి తగ్గుతుంది:

చాలా మంది పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా నత్తిగా మాట్లాడతారు. అలాంటి వారు వారికి ఆకులను ఎండబెట్టి పొడి, ఆకుల రసం, ఆకులను తినిపించినా నత్తి పోయి.. చక్కగా మాట్లాడతారు.

తెలివి పెరుగుతుంది:

చిన్న పిల్లలకు చక్కగా ఆకులను తినిపించినా, రసం పట్టించినా, లేహ్యం తినిపించినా వీరిలో చక్కగా తెలివి పెరుగుతుంది. చిన్నప్పటి నుంచే చక్కగా పని చేస్తారు. చదువుల్లో కూడా ముందు ఉంటారు.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది:

సరస్వతీ ఆకులు తిన్నా, రసాన్ని పట్టించినా రక్తం శుద్ధి అవుతుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వంటివి త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి. ఒకవేళ సమస్య ఉన్నా తగ్గుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *