Salaar: ప్ర‌భాస్ ‘స‌లార్: పార్ట్‌1-సీజ్‌ఫైర్‌’కు ఏడాది పూర్తి.. పార్ట్ 2 ‘శౌర్యాంగ ప‌ర్వం’ రిలీజ్ ఎప్పుడంటే?

Salaar: ప్ర‌భాస్ ‘స‌లార్: పార్ట్‌1-సీజ్‌ఫైర్‌’కు ఏడాది పూర్తి.. పార్ట్ 2 ‘శౌర్యాంగ ప‌ర్వం’ రిలీజ్ ఎప్పుడంటే?


భారీ తారాగ‌ణం, కాన్వాస్‌, అబ్బుర‌ప‌రిచే యాక్ష‌న్ స‌న్నివేశాలతో సలార్ సినిమా యాక్ష‌న్ జోన‌ర్‌లో స‌రికొత్త పంథాను క్రియేట్ చేసింది. ప్ర‌భాస్ మాస్ అప్పీల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ పెర్ఫామెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ దీన్ని ఓ క‌ల్ట్‌మూవీగా నిల‌బెట్టింది. ఓటీటీ మాధ్యమంలో ‘స‌లార్: పార్ట్‌1-సీజ్‌ఫైర్‌’ 300 రోజుల పాటు ట్రాప్ ట్రెండింగ్‌లో నిల‌వ‌టం విశేషం. ఇది సినిమా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో సంపాదించుకున్న స్థానం, తిరుగులేని విజ‌యానికి తార్కాణంగా నిలిచింది. అలాగే ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రీ రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుత‌మైన స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ‘స‌లార్: పార్ట్‌1-సీజ్‌ఫైర్‌’ అనేక ఊహించ‌న మ‌లుపులు తిరుగుతూ సీక్వెల్‌గా ‘స‌లార్ పార్ట్‌2: శౌర్యాంగ ప‌ర్వం’ రానుంద‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ సలార్ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌లో న‌టించగా శ్రుతీ హాస‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, శ్రియా రెడ్డి త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెప్పించారు. ‘స‌లార్: పార్ట్‌1-సీజ్‌ఫైర్‌’ ఏడాది పూర్తి చేసుకున్న‌ సంద‌ర్భంగా హోంబలే ఫిల్మ్స్ ‘స‌లార్ పార్ట్‌2: శౌర్యాంగ ప‌ర్వం’ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేసింది.

ఇవి కూడా చదవండి

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఒక అరడజనకు పైగా సినిమాలున్నాయి. సలార్ పార్ట్ -2, కల్కి-2 సినిమాలతో పాటు ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ మూవీస్ ఉన్నాయి.

అంచనాలకు మించి సలార్ పార్ట్ 2 ఉంటుంది: ప్రశాంత్ నీల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *