Sachin Tendulkar: తనే కాబోయే జహీర్ ఖాన్! ఏకంగా దేవుడే ట్వీట్ వేసాడు చూడండి! వీడియో వైరల్

Sachin Tendulkar: తనే కాబోయే జహీర్ ఖాన్! ఏకంగా దేవుడే ట్వీట్ వేసాడు చూడండి! వీడియో వైరల్


ప్రపంచవ్యాప్తంగా “క్రికెట్ గాడ్”గా పేరుపొందిన సచిన్ టెండూల్కర్, అట్టడుగు ప్రతిభకు ఎల్లప్పుడూ తోడుంటాడు. ఈ మధ్యనే, రాజస్థాన్‌కు చెందిన యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సుశీలా మీనా బౌలింగ్ ప్రతిభను ప్రదర్శించే వీడియోను ‘X’ లో పంచుకున్నారు. ఈ యువ బౌలర్ బౌలింగ్ యాక్షన్, టెండూల్కర్‌కు భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌ను గుర్తు చేసింది. ఆమే చాలా సహజంగా బౌలింగ్ వేస్తుందని.. చూడటానికి అద్భుతంగా ఉందని పేర్కొన్నారు! సుశీలా మీనా బౌలింగ్ యాక్షన్‌లో జహీర్ ఖాన్ పోలీకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటూ ఆయన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

వీడియోలో సుశీలా తన అద్భుతమైన బౌలింగ్‌తో క్రికెట్ ప్రేమికులనే కాదు, లెజెండ్స్‌ను కూడా ఆకట్టుకుంది. ఈ వీడియో వైరల్ అవడంతో, గ్రామీణ భారతదేశంలో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభ గురించి చర్చలు మళ్లీ మొదలయ్యాయి. పల్లెటూరికి చెందిన పాఠశాల విద్యార్థిని అయిన సుశీలా, భారతదేశ మారుమూల ప్రాంతాల్లో ఉండే గొప్ప ప్రతిభకు, సంకల్పానికి ఓ ఉదాహరణ. టెండూల్కర్ వంటి దిగ్గజ క్రికెటర్ ఆమె ప్రతిభను గుర్తించడం, ఆమెలాంటి ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచింది.

టెండూల్కర్ తన వినయం, ఆటపట్ల మక్కువతో పాటు యువ ఆటగాళ్లను గుర్తించడం, వారిని ప్రోత్సహించడం ద్వారా మాస్ట్రోగా నిలిచారు. ఆయన గుర్తింపు యువ క్రికెటర్లకు మైలురాయిగా, క్రికెట్ ప్రపంచంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి పునాది రాయి వేసినట్లే.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *