దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘RRR’ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఇందులోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. జేమ్స్ కెమరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి ప్రముఖ దర్శకులు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని ప్రశంసించారు. విదేశాల్లోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీని రూపొందించబోతున్నారు. ఈ నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘RRR: బిహైండ్ అండ్ బియాండ్’ అనే డాక్యుమెంటరీ విడుదల కానుంది. ఈ డాక్యుమెంటరీ పోస్టర్ ఇప్పటికే విడుదల కాగా, ఆ పోస్టర్‌లో రాజమౌళి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. దీనికి ‘ప్రపంచం కీర్తిని చూసింది, ఇప్పుడు దాని వెనుక ఉన్న కథను చూస్తుంది’ అని క్యాప్షన్ ఉంది. ఆర్ఆర్ ఆర్ సినిమా కథ ఎలా పుట్టింది, కథ పెరిగిన విధానం, కోవిడ్ వల్ల ఎదురుదెబ్బలు, ఆ తర్వాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ కావడం, ఎదుర్కొన్న సమస్యలు.. ఇలా ఎన్నో విషయాలను ఈ డాక్యుమెంటరీ ద్వారా రాజమౌళి పంచుకోనున్నారని సమాచారం.
ఇప్పటికే యూట్యూబ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర వీడియోలు వచ్చాయి. సినిమా వీఎఫ్‌ఎక్స్ ఎలా చేశారో, సినిమా కాస్ట్యూమ్స్, యాక్షన్ సన్నివేశాల వీడియోలు ఉన్నాయి. అయితే ఈ డాక్యుమెంటరీలో అసలు నేపథ్యం, సాంకేతికత తదితర అంశాల గురించి చిత్రబృందం స్వయంగా మాట్లాడుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు ఆస్కార్‌కు వెళ్లిన అనుభవం, అక్కడ జరిగిన సంఘటనలు, ఆస్కార్ ప్రచారం తదితర అనేక అంశాలతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కనుంది.
ఇవి కూడా చదవండి
త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
The world saw the glory.
Now witness the story!𝐑𝐑𝐑: 𝐁𝐞𝐡𝐢𝐧𝐝 & 𝐁𝐞𝐲𝐨𝐧𝐝
Documentary film coming this December 🔥🌊 #RRRBehindAndBeyond #RRRMovie pic.twitter.com/HNadZg2kem— RRR Movie (@RRRMovie) December 9, 2024
‘RRR: బిహైండ్ అండ్ బియాండ్’ అనే డాక్యుమెంటరీ ఈ నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారతదేశంలోనే కాకుండా అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత కూడా భారీ వ్యూస్ వచ్చాయి. అమెరికాలో రెండు సార్లు విడుదలైన ఈ సినిమా రెండు సార్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
This day, 6 years ago, the journey of the epic #RRRMovie began as the shoot commenced. A cinematic milestone that has since become a global sensation!
And stay tuned for the finale… 😉 Coming up in a few weeks. pic.twitter.com/9k7MrXyMBs
— RRR Movie (@RRRMovie) November 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.