Raw Milk: పచ్చి పాలను తాగుతున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..!

Raw Milk: పచ్చి పాలను తాగుతున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..!


శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పాలు తాగడం, గుడ్లు తినడం మంచిది. ఇవి మన ఎముకలను ధృడంగా చేస్తాయి. శరీరానికి బలాన్ని ఇస్తాయి. నేటికీ సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక గ్లాసు పాలు ఇస్తారు. నిజానికి పాలలో కాల్షియం ఉంటుంది. మన ఎముకలను బలంగా , ఆరోగ్యంగా ఉంటాయి. పాలను మరిగించి త్రాగడానికి ఉత్తమమైన మార్గం అయినప్పటికీ, కొంతమంది పచ్చిగా తాగడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని కొందరు నమ్ముతారు. అయితే పాశ్చరైజ్ చేయని పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడం కంటే ఎక్కువ హాని చేస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆవు, గేదె లేదా మేక నుంచి తీసిన పాశ్చరైజ్ చేయని పాలలో హానికరమైన జెర్మ్స్ లేదా బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి చాలా తీవ్రమైన వ్యాధులను కలిస్తాయి. మార్కెట్‌లో లభించే ప్యాకెట్ పాలు పాశ్చరైజ్ చేయబడి ఉంటాయి. మీరు నేరుగా తాగవచ్చు. అయినా సరే ఇప్పటికీ ప్రజలు ఆ పాలను మరిగించిన తర్వాత ఉపయోగిస్తారు.

పచ్చి పాలు తాగడం వల్ల కలిగే వ్యాధులు

నేటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గేదె లేదా ఆవు నుంచి పాలను తీసుకుని వాడుతున్నారు. అయితే ఈ పాలను పచ్చిగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పచ్చి పాలలో జెర్మ్స్ లేదా బ్యాక్టీరియా ఉండవచ్చు. అప్పుడు పచ్చి పాలు తాగడం వలన ఆర్థరైటిస్, డయేరియా లేదా డీహైడ్రేషన్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

గర్భిణీ స్త్రీకి ప్రమాద కరం

పచ్చి పాలు గర్భిణీ స్త్రీకి కూడా మంచిది కాదు ఎందుకంటే ఇందులో లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది లిస్టెరియోసిస్ అనే ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఇది గర్భిణీ స్త్రీకి , నవజాత శిశువుకు ప్రమాదకరంగా ఉంటుంది. పచ్చి పాలను గర్భిణీ స్త్రీలు తాగడం వల్ల గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవించడం లేదా బిడ్డ , తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదం కలగవచ్చు.

బర్డ్ ఫ్లూ ముప్పు

పచ్చి పాలలో అనేక రకాల హానికరమైన బ్యాక్టిరియాలు ఉంటాయి. వాటిలో ఒకటి HPAI A (H5N1) ఇది బర్డ్ ఫ్లూని కలిగిస్తుంది. పాల నుంచి బర్డ్ ఫ్లూ రావడం చాలా కష్టమైనప్పటికీ.. పాలతో చేసిన టీ లేదా దానితో చేసిన ఇతర ఉత్పత్తులను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

యాసిడ్ స్థాయిలలో పెరుగుదల

పాలు మరిగించడానికి లేదా పాశ్చరైజ్ చేయడానికి ముందు.. పచ్చి పాలల్లో అనేక ఆమ్లాలు, ప్రోటీన్లు ఉన్నాయి. కనుక పాలను పచ్చిగా తాగితే శరీరంలో యాసిడ్ ఉత్పత్తిని పెరుగుతుంది. దీని కారణంగా కడుపు సంబంధిత వ్యాధులు లేదా సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. లేదా కడుపు నొప్పి లేదా ఎసిడిటీ బారిన పడవచ్చు. శరీరంలోని యాసిడ్ స్థాయిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *