ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల లిస్టులో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ .పుష్ప 2 సినిమాతో బన్నీ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఇక అల్లు అర్జున్‌తో పోలిస్తే విజయ్ దేవరకొండ జూనియర్. అయితేనేం టాలీవుడ్ రౌడీ బాయ్ గా అతి తక్కువ కాలంలోనే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కాగా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇటీవలే బన్నీ జైలు నుంచి విడుదలైన తర్వాత ఇంటికెళ్లి మరీ అతనిని పలకరించాడు విజయ్ దేవర కొండ. ఇక ఈ ఇద్దరికీ నటనతో పాటు స్టైల్‌లోనూ చాలా పోలికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జునా? విజయ్ దేవరకొండనా? ఇద్దరిలో ఎవరు బెస్ట్? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆసక్తికర సమాధానమిచ్చింది. అల్లు అర్జున్‌తో రష్మిక మందన్నకు మంచి స్నేహం ఉంది. పుష్ప, పుష్ప 2 సినిమాల్లో వీరిద్దరి జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. ఇక విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడు వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు రష్మిక మందన్న తెలివిగా ఆన్సర్ ఇచ్చింది
ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్నను అల్లు అర్జున్ లేదా విజయ్ దేవరకొండ లేదా ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని అడిగారు. దీనిపై రష్మిక మందన్న స్పందిస్తూ.. ‘విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా వండర్‌తో సమానం. వీరిద్దరూ మన దేశ చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ ప్రతిభ గల నటీనటుల్లో నిలుస్తారు. ఇద్దరు ప్రతిభావంతులైన నటుల గురించి నాలాంటి నటిని అభిప్రాయం అడగడం సరికాదు. . ఇతరుల ప్రతిభతో సమానమైన వారికే వారి గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు, అధికారం ఉంటుంది. కాబట్టి వాళ్లిద్దరి ట్యాలెంట్‌పై వ్యాఖ్యానించే అర్హత నాకు లేదు’ అని ఇంటెలిజెంట్ గా రిప్లై ఇచ్చింది రష్మిక.
ఇవి కూడా చదవండి
పుష్ప 2 సినిమాలో రష్మిక..
కాగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండలకు సూపర్ హిట్ జోడీగా పేరుది. వీరిద్దరు కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రేమలో ఉన్నారని తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.