Rashmika: లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా ??

Rashmika: లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా ??


జీవితంలోని కష్ట సమయంలో తనకు సపోర్ట్‌ చేయాలనీ కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలనీ ఆమె అన్నారు. శ్రద్ధ వహించాలనీ మంచి మనసు ఉండాలనీ ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసి ఉండొచ్చు అని తెలిపారు. ఇక ప్రేమ గురించి చెబుతూ.. జీవితంలో ప్రతిఒక్కరికీ తోడు కావాలనీ తన దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగిఉండడమే అనీ చెప్పారు. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదనీ ఒడిదుడుకుల్లో తమతో ఉండి సపోర్ట్‌ చేసేవారు ఉండాలి అని అన్నారు. ఇక రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో అలరించేందుకు బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన ‘పుష్ప 2 ది రూల్‌’ ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. రూ.1500 కోట్లకు చేరువలో ఉంది. అలాగే రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ టీజర్‌ తాజాగా విడుదలైంది. విజయ దేవరకొండ వాయిస్‌ అందించిన ఆ టీజర్‌ అందరినీ ఆకర్షిస్తోంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో విభిన్నమైన ప్రేమ కథతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా రానుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎముకలు కొరికే చలి…ఇంకా ఎన్నాళ్లు ??

కీసర గురుకులంలో ఎలుకల కలకలం

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల

మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. మనోజ్‌కు తల్లి షాక్‌

‘నాకు ఫ్లాట్‌మేట్‌ కావాలి’.. బెంగళూరు యువతి పోస్ట్‌ వైరల్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *