ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది.. లెక్కలు మారుతున్నాయి.. పెద్ద సినిమాలు వస్తే అంతా ముందుగా మాట్లాడుతున్నది కలెక్షన్ల గురించే.
మరీ ముఖ్యంగా US ప్రీమియర్స్‌లో ఎంత వస్తున్నాయనే చర్చ కూడా షురూ అయింది. మరిప్పుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ అక్కడే జరగబోతుంది.
మరి రామ్ చరణ్ ముందు ఏయే టార్గెట్స్ ఉన్నాయి..? వాటిని గేమ్ ఛేంజర్ అందుకుంటాడా..? గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్.
మరి రామ్ చరణ్ ముందు ఏయే టార్గెట్స్ ఉన్నాయి..? వాటిని గేమ్ ఛేంజర్ అందుకుంటాడా..? గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్.
ఓవర్సీస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోడానికి అక్కడే ఈవెంట్ ప్లాన్ చేసారు గేమ్ ఛేంజర్ టీం. ఇది అక్కడ కలెక్షన్లు పెంచడంలోనూ యూజ్ కానుంది. రీసెంట్గా వచ్చిన పెద్ద సినిమాలు ఓవర్సీస్లో ప్రీమియర్స్ నుంచే రికార్డులు తిరగరాసాయి.
దేవరకు ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే 3.77 మిలియన్ వస్తే.. పుష్ప 2కు 4.33 మిలియన్, కల్కి 2898 ఏడికి 5.56 మిలియన్ డాలర్స్ వచ్చాయి. గేమ్ ఛేంజర్‌కు ఓవర్సీస్లో ఓపెనింగ్స్ పరీక్ష మొదలైందిప్పుడు.
ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో..! చరణ్‌కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే. పైగా శంకర్ సినిమాలు అక్కడ రప్ఫాడిస్తుంటాయి.
దిల్ రాజు బ్రాండ్ ఎలాగూ ఉంది. ఈ ముగ్గురూ కలిసి ఎన్ని మిలియన్స్ ఓపెనింగ్ తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. జనవరి 9న భారీగా US ప్రీమియర్స్ పడనున్నాయి.