రాగి, బెల్లం రెండూ ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ వీటిని తినమంటే పిల్లలు తినరు. వారికి ఇష్టంగా, ఆరోగ్యంగా చేసి పెట్టాలంటే వాళ్లకు నచ్చే విధంగా చేయాలి. పిల్లలు ఇష్టంగా కేక్ తింటూ ఉంటారు. అది ఎలా ఉన్నా సరే వారికి నచ్చుతుంది. కాబట్టి వారికి నచ్చేలా ఆరోగ్యంగా రాగి, బెల్లం కేక్ తయారు చేయవచ్చు. ఇది కేవలం పెద్దలకే కాదు పిల్లలకు కూడా నచ్చుతుంది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రాగి బెల్లం కేక్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రాగి, బెల్లం కేక్‌కి కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి, బెల్లం పొడి, పెరుగు, ఆయిల్, గుమ్మడి కాయ గింజలు, బాదం పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిల్లా ఎసెన్స్, ఉప్పు, డ్రై ఫ్రూట్స్
రాగి, బెల్లం కేక్ తయారీ విధానం:
ముందుగా ఓవెన్‌ని 180 డిగ్రీల సెల్సియస్ వద్ద హీట్ చేయాలి. రాగి పిండిని, బెల్లం పొడి చల్లించి తీసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు సన్నగా కట్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక దాని తర్వాత మరొకి గిన్నెలోకి తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అవన్నీ బాగా కలపాలి. కేక్‌ని ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫ్ఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ ట్రేలో తీసుకోవాలి. పై నుంచి డ్రై ఫ్రూట్స్‌ని చల్లుకోవాలి. ఓ 30 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కేక్‌ని చేయండి. కేక్ చల్లారిన తర్వాత ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కేక్ సిద్ధం. పిల్లలకు స్నాక్ టైమ్‌లో, స్కూల్ బాక్స్‌లో స్నాక్‌గా పెట్టొచ్చు.