Ashwin Retires From International Cricket: గబ్బా టెస్ట్ ఫలితం తర్వాత అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ ఊహించని పరిణామంతో మాజీలు సైతం ఆశ్యర్యానికి గురవుతున్నారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు టెస్టులు జరిగాయి. మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కు ఎంపికైన ఆశ్విన్‌కు కేవలం ఓకే మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ దక్కింది.
ఇక టెస్టుల విషయానికి వస్తే ఆర్ అశ్విన్ 537 టెస్టు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్టు పడగొట్టిన జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ ఆల్-టైమ్ టెస్ట్ వికెట్లు తీసిన జాబితాలో 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
ర్యాంక్ | పేరు | మ్యాచ్‌లు | ఇన్నింగ్స్ | వికెట్లు |
1 | ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) | 133 | 230 | 800 |
2 | షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) | 145 | 273 | 708 |
3 | జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్) | 188 | 350 | 704 |
4 | అనిల్ కుంబ్లే (ఇండియా) | 132 | 236 | 619 |
5 | స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) | 167 | 309 | 604 |
6 | గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) | 124 | 243 | 563 |
7 | రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా) | 106 | 200 | 537 |
8 | నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా) | 132 | 246 | 533 |
9 | కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) | 132 | 242 | 519 |
10 | డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా) | 93 | 171 | 439 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..