భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు త్వరలో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. వెంకట దత్తసాయి అనే ఐటీ ప్రొఫెషనల్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాబోయే వధూ వరులు పీవీ సింధు, వెంకట దత్తసాయి ఉంగరాలు మార్చుకున్నారు. అలాగే ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కిన సమయంలో.. తిరిగి మనం ప్రేమించాలి’ అని తన ఎంగేజ్ మెంట్ ఫొటోలకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది పీవీ సింధు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాబోయే భర్తతో పీవీ సింధు..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..