పుష్ప 2 సినిమాలో వచ్చే పాట, హీరో యాక్టింగ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ప్రస్తుతం ఈ గెటప్ దేశవ్యాప్తంగా అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆ గెటప్ వేసుకుని తమ అభిమాన హీరోలా మురిసిపోతున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో ఓ యువకుడు పుష్పరాజ్ వేషంతో వీధుల్లో తిరుగుతూ హల్‌చల్ చేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ ఆల్ఫా-2లో ఓ యువకుడు అల్లు అర్జున్ గంగమ్మ వేషంతో వీధుల్లో తిరుగుతున్నాడు. చీర కట్టుకుని, అమ్మవారిలా అలంకరించుకుని అచ్చం సినిమాలో హీరోలా తయారయ్యి రీల్స్ చేస్తున్నాడు. రోడ్డు మీద తిరుగుతున్న ఆ యువకుడిని ఎవరైనా పలకరిస్తే.. తగ్గేదేలే అనే సిగ్నేచర్ మూమెంట్ చేస్తూ సమాధానమిస్తున్నాడు. గంగమ్మ వేషధారణలో ఉన్న ఆ యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.