Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాట .. జగపతి బాబు సంచలన వీడియో

Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాట .. జగపతి బాబు సంచలన వీడియో


అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టై మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా ఈ ఘటనపై శనివారం (డిసెంబర్ 21) అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ కి ఏమైందని అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు? అందులో ఒక్కరైనా రేవతి కుటుంబాన్ని, గాయపడిన బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘ నేను షూటింగ్ నుంచి రాగానే ఆస్పత్రికి వెళ్ళాను. ఈ ఘటనలో బాధితులైన రేవతి కుటుంబాన్ని, శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించాను. మానవత్వంతో అక్కడికి వెళ్లాను. ఆ బాబు ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పాను. అయితే నేను శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెళ్లినట్టు పబ్లిసిటీ చేసుకోలేదు. కాబట్టి ఎవరికి తెలియదు. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లలేదని అంటున్నారు. అందుకే ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు జగ్గూ భాయ్.

జగపతిబాబు షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, అలాగే ప్రొడ్యూసర్ బన్నీవాస్ కూడా ఇప్పటికే శ్రీ తేజ్ ను పరామర్శించారు. అయితే ఈ కేసు కోర్టు పరిధిలో ఉండడంతో శ్రీ తేజ్ ను కలవలేకపోతున్నానని అల్లు అర్జున్ అంటున్నాడు. అనుమతి వచ్చిన తక్షణమే ఆస్పత్రికి వెళ్లి రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తానని శనివారం (డిసెంబర్ 21) నాటి ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

జగపతి బాబు వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *