Pushpa 2: శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. రేవతి కుటుంబానికి రూ. 50 లక్షల సాయం అందజేత

Pushpa 2: శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. రేవతి కుటుంబానికి రూ. 50 లక్షల సాయం అందజేత


సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పుష్ప 2 నిర్మాతలు పరామర్శించారు. సోమవారం (డిసెంబర్ 23)నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి కిమ్స్ ఆస్పత్రిక వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని, సినిమా హీరోల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పుష్పా 2 నిర్మాతలు 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి..ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు. బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్లడం లేదని అన్ని పుకార్లు ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు మాట్లాడుతూ.. ‘తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి తీరనిలోటు. ప్రస్తుతం శ్రీతేజ్‌ కోలుకుంటున్నాడు. బాధిత కుటుంబానికి మా వంతు సాయం చేయడానికి ఇక్కడకు వచ్చాం. వారి కుటుంబానికి ఎప్పటికీ అండగా నిలబడతాం’ అని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

రేవతి భర్తతో మాట్లాడుతోన్న పుష్ప 2 నిర్మాతలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *