Pushpa 2: వరల్డ్ వైడ్‌గా దుమ్మురేపుతున్న వైల్డ్ ఫైర్.. 23రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

Pushpa 2: వరల్డ్ వైడ్‌గా దుమ్మురేపుతున్న వైల్డ్ ఫైర్.. 23రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే


ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయం సాదించింది. 2021లో విడుదలైన పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. అలాగే సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ లోనూ ఎక్కువ కలెక్ట్ చేశారు. అంతే కాదు నేపాల్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.

‘పుష్ప 2’ నేపాల్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా నిలిచింది. నేపాల్‌లో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ సినిమా కూడా రాబట్టని వసూళ్లు సొంతం చేసుకుంది. దీంతో నేపాల్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. పుష్ప 2: ది రూల్ నాల్గవ వారంలోకి ప్రవేశించినప్పటికీ బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తూనే ఉంది. కేవలం 23 రోజుల్లోనే పుష్ప 2 రూ. 1128.85 కోట్లు వసూల్ చేసింది. పుష్పాకి పోటీగా బేబీ జాన్, మార్కో, బరోజ్, మాక్స్  సినిమాలు రిలీజ్ అయినా.. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది.

పుష్ప 2 ఈ శుక్రవారం నాడు రూ. 8.75 కోట్లు రాబట్టింది. దాని మొత్తం ఇండియాలో రూ. 1128.85 కోట్లు సొంతం చేసుకుంది. పుష్ప2 మొదటి వారంలో రూ.725.8 కోట్లు, 2వ వారంలో రూ.264.8 కోట్లు, 3వ వారంలో రూ.129.5 కోట్లు వసూలు చేసింది. తాజాగా పుష్ప 2 చిత్రం రూ. 1719.5 కోట్లు వసూలు చేసి, అత్యంత వేగంగా రూ. 1700 కోట్ల మార్కును దాటిన ఇండియన్ మూవీగా నిలిచింది. బాహుబలి 2 మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా రూ.1788 కోట్లు రాబట్టింది. దంగల్ రూ. 2000 కోట్ల మార్కును దాటింది. ఇప్పుడు పుష్ప 2 ఊపు చూస్తుంటే ఈ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేలా కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *