అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓవరాల్ గా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్లు చూసి అందరూ షాక్ అవుతున్నారు. బాలీవుడ్ స్టార్లు కూడా వావ్ అంటున్నారు. ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ ఇప్పటివరకు 400 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సినిమా రిలీజై వారం రోజులు గడిచినా ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదలైంది. హిందీ వెర్షన్ తొలిరోజు 72 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2వ రోజు 59 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 3వ రోజు వసూళ్లు 74 కోట్ల రూపాయలు. ఆశ్చర్యకరంగా 4వ రోజు మొత్తం 86 కోట్ల రూపాయలు వచ్చాయి. 5వ రోజు రూ.48 కోట్లు, 6వ రోజు రూ.36 కోట్లు, 7వ రోజు రూ.31.50 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన ‘పుష్ప 2’ సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్ 7 రోజుల్లో 406.50 కోట్ల రూపాయలు. నార్త్ ఇండియా ప్రజలు ఈ సినిమాను ఎంతలా ఆదరిస్తున్నారో ఈ లెక్కలే నిదర్శనం. ఇప్పటికీ ఈ సినిమా హవా తగ్గలేదు. వీకెండ్‌లో మళ్లీ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. హిందీ వెర్షన్ 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తుందంటున్నారు ట్రేడ్ నిపుణులు.
కాగా 2021లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం హిందీ ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత రష్మిక మందన్నకు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ వంటి సినిమాలతో హిందీ ఆడియెన్స్ కు మరింత చేరువైందీ అందాల తార. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాతో రష్మిక పాపులారిటీ మరింత పెరిగింది. ఇక పుష్ప 2 సినిమాలో నటనకు గానూ అల్లు అర్జున్‌కి మళ్లీ జాతీయ అవార్డు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
వీకెండ్ లో రూ. 500 కోట్ల క్లబ్ లోకి పుష్ప 2..
400 NOT OUT… ‘PUSHPA 2’ REWRITES RECORD BOOKS…
Fastest ₹ 250 cr ✅
Fastest ₹ 300 cr ✅
Fastest ₹ 400 cr ✅#Pushpa2 continues to shatter records, setting new milestones every day.The 7-day biz [Thursday to Wednesday] has set a new benchmark… Most importantly, these… pic.twitter.com/P9Zlof768M
— taran adarsh (@taran_adarsh) December 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.