ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈసినిమా ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 5న విడుదలై ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కిస్సిక్, పీలింగ్స్ పాటలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పాటలకు నెట్టింట రీల్స్ చేస్తున్నారు జనాలు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పీలింగ్స్ పాటకు అదరగొట్టేస్తున్నారు. తాజాగా ఓ బామ్మా తన మనవడితో కలిసి పీలింగ్స్ పాటకు స్టెప్పులేసింది. అల్లు అర్జున్-రష్మిక మందన కలిసి నటించిన పీలింగ్స్ పాటకు తన మనవడితో కలిసి ఓ బామ్మా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
అందులో తన మనవడితో కలిసి ఓ బామ్మ ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ వీడియోను ఇప్పటికే లక్ష మందికి పైగా చూశారు. చాలా మంది బామ్మను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టుకుని, అందమైన చిరునవ్వుతో, బామ్మ పుష్ప 2 పాటకు స్టెప్పులు వేసింది.ప్రజలు పుష్పాదాది అని ఆమె వీడియోను షేర్ చేస్తున్నారు. డిసెంబర్ 14న అక్షయ్ పార్థ అనే ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది.
ఈ బామ్మ, మనవడు కలిసి ఇంతకు ముందు అనేక పాటలకు డ్యాన్స్ చేశారు. చాలా వీడియోలను లక్షలాది మంది వీక్షించారు. వీరి ఇన్ స్టా ఖాతాకు 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.