Pushpa 2: ‘అల్లు అర్జున్‌కో రూలు.. వాళ్లకో రూలా?’ సుమన్ సంచలన కామెంట్స్

Pushpa 2: ‘అల్లు అర్జున్‌కో రూలు.. వాళ్లకో రూలా?’ సుమన్ సంచలన కామెంట్స్


పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దురదృష్టవశాత్తూ రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే తీవ్ర గాయాలపాలైన ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దీనిని కేంద్రమంత్రులు, స్థానిక రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఖండించారు. అల్లు అర్జున్ కు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ బన్నీ అరెస్ట్ పై స్పందించారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం చాలా తప్పని మండిపడ్డారు. ‘అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ముమ్మాటికి తప్పే. హీరోని పిలిచినప్పుడు సెక్యూరిటీ బాధ్యత థియేటర్ యాజమాన్యం తీసుకోవాలి. క్రౌడ్ కు తగ్గట్టుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఒక యాక్టర్ గా థియేటర్ కు వెళ్లడం అల్లు అర్జున్ చేసింది తప్పే కాదు . ఈ ఘటన ఒక హెచ్చరిక.. దయచేసి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటేనే హీరోలను థియేటర్ యాజమాన్యం పిలవండి . ఒక ప్రాణం పోయింది ఆ బాధ ఆ కుటుంబానికి తీర్చలేనిది. ఒక అభిమాని ప్రాణం కోల్పోయింది. ఇది చాలా బాధగా ఉంది. గతంలో అనేక ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాటి గురించి ఎందుకు మాట్లాడరు. వాళ్లకో రూలు.. అల్లు అర్జున్ కు ఒక రూలా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సుమన్.

కాగా తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీ తేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు. త్వరలోనే బాలుడిని కలుస్తానంటూ బన్నీ ట్వీట్ చేశారు. ‘నేను నిత్యం శ్రీతేజ్‌ గురించి ఆలోచిస్తున్నా. దురదృష్టవశాత్తూ ఆ ఘటన జరిగింది. ప్రస్తుతం శ్రీతేజ చికిత్స తీసుకుంటున్నాడు. లీగల్‌ ప్రొసీడింగ్స్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను. శ్రీతేజ్‌నీ, అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవొద్దని సూచించారు. నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తాను. వైద్య, కుటుంబపరమైన అవసరాలను తీరుస్తాను. ఆ కుటుంబానికి సంబంధించి బాధ్యతలను తీసుకుంటాను. శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలి. త్వరలోనే అతన్ని, అతని కుటుంబాన్ని కలుసుకుంటానని ఆశిస్తున్నాను’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *