Pushpa 2:రప్పా రపా..! పుష్ప2 జాతర సీన్ పై ట్వీట్ చేసిన నటి.. ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Pushpa 2:రప్పా రపా..! పుష్ప2 జాతర సీన్ పై ట్వీట్ చేసిన నటి.. ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..


అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ లోనూ అల్లు అర్జున్ సినిమా తెలుగు సినిమా సత్తా ఏంటో చూపిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప 2 సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలను మార్చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. గతంలో వచ్చిన పుష్ప 1 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప 2 వన్ కు మించి బ్లాక్ బస్టర్ అయ్యింది. సుకుమార్ పుష్ప 2ను చాలా పగడ్బందీగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. తొలి షో నుంచే పుష్ప 2 బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. కనిపెట్టండి చూద్దాం..! ఈ స్టార్ యాంకరమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

పుష్ప 2 సినిమా పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ పుష్ప సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆతర్వాత నెటిజన్స్ ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆమె చేసిన పోస్ట్ ఏంటి.? నెటిజన్స్ ఎందుకు ఆమెను ట్రోల్ చేస్తున్నారంటే.. పుష్ప సినిమా పై చాలా మంది హీరో, హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. అలాగే హీరోయిన్ సంయుక్త షన్‌ముఘనాథన్.

ఇది కూడా చదవండి :Pushpa 2: దొరికేసింది రోయ్..! అల్లు అర్జున్ ఫ్యాన్ గర్ల్ బయట మామూలుగాలేదుగా..!!

ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ” నేను పుష్ప 2 సినిమాను  ఫోనిక్స్ మాల్‌లో చూశా.. జాతర సీన్ స్టార్ట్ అవ్వడం, చీరలో హీరో డ్యాన్స్ వేయడం చూసి.. నా పక్కనే ఉన్న మహిళ పూనకం వచ్చినట్టుగా చేసింది. సీట్ లో ఆమె పూనకంతో ఊగిపోయింది. ఆమె భర్త తనను కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు.. దీంతో దెబ్బకు భయం వేసి పది రూపాయల టికెట్‌కు వెళ్లి కూర్చున్నా”.. అని రాసుకొచ్చింది. ఇప్పుడు ఈపోస్ట్ తెగ వైరల్ అవుతుంది. నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పదిరూపాయిల టికెట్ మా చిన్నప్పుడే తీసేశారు. ఏ కాలంలో బ్రతుకుతున్నావ్ తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంయుక్త ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *