[ad_1]
మహారాష్ట్రలోని పూణెలోని వాఘోలీ చౌక్‌లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని డంపర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మూడు మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించినట్లు అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను విచారిస్తున్నారు.
డంపర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫుట్‌పాత్‌పై వెళ్తున్న వ్యక్తులను తన వాహనంతో ఢీకొట్టిన అనంతరం వాహనాన్ని అక్కడే వదిలేశాడు. ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ ఎలాంటి నిర్దిష్ట సమాచారం ఇవ్వడం లేదని అధికారి ఒకరు తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్నాడని.. దీంతో డంపర్ అదుపు తప్పి పోయిందని అనుమానిస్తున్నారు.
ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు
ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో రోడ్డు మీద వెళుతున్న జనం గుమిగూడారు. అటుగా వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులు రోడ్డు పక్కన సహాయం కోసం వేడుకుంటూ కనిపించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇవి కూడా చదవండి
పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు
డంపర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. డ్రైవర్‌ను విచారిస్తున్నారు. వాహనంలో ఏదైనా సాంకేతిక సమస్య ఉందా..లేదా డ్రైవర్ నిర్లక్ష్యం, తాగడం వలెనే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పక్కన అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని, దీంతో ప్రమాదానికి సంబంధించిన వాస్తవ సమాచారం రాబట్టేందుకు వీలుందని పోలీసులు చెప్పారు. అదే సమయంలో గాయపడిన వారి పరిస్థితి మెరుగుపడిన వెంటనే వారి నుంచి తగిన సమాచారం తీసుకుంటామని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
[ad_2]
Source link