కొన్నేళ్ల క్రితం పృథ్వీ షాను భారత క్రికెట్ భవిష్యత్తుగా భావించారు. స్టాండ్స్ లో కానీ షాట్ సెలెక్షన్లలో సచిన్ ను గుర్తు చేయడంతో మరో మాస్టర్ బ్లాస్టర్ దొరికేశాడన్నారు. అందుకు తగ్గట్టుగానే చిన్న వయసులోనే టీమిండియా తలుపు తట్టాడు. కొన్ని మ్యాచుల్లో బాగానే రాణించాడు. అయితే ఉన్నట్లుండి పృథ్వీ షా క్రికెట్ కెరీర్ కు గ్రహణం పట్టుకుంది. పేలవమైన ఆటతీరు కారణంగా మొదట టీమ్ ఇండియా నుంచి తప్పించారు. ఆ తర్వాత ఐపీఎల్ టోర్నీ లోనూ ఉద్వాసన తప్పలేదు. ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కూడా నిలకడగా రాణించలేకపోయాడు. టోర్నీలో ముంబై గెలిచింది కానీ పృథ్వీషా ఆకట్టుకోలేకపోయాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ 10 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ముంబై క్రికెటర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రతిష్ఠాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ నుంచి పృథ్వీషాను తప్పించారు. దీంతో అతని క్రికెట్ కెరీర్ ముగిసిపోయిందనే చర్చ మొదలైంది.
కాగా విజయ్ హజారే ట్రోఫీ నుంచి తనను తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు పృథ్వీషా. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ’65 ఇన్నింగ్స్‌లు, 55.7 సగటు, 126 స్ట్రైక్ రేట్‌తో 3399 పరుగులు, దేవుడా.. నేను ఇంకా ఏం చేయాలో చెప్పు. ఈ గణంకాలు ఉన్న నేను పనికి రానా? అయినా నీపైనే నేను నమ్మకం పెట్టుకున్నాను. జనాలకు నాపైన ఇంకా నమ్మకముందని ఆశిస్తున్నాను.ఎందుకంటే నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను..ఓం సాయిరామ్’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చాడు పృథ్వీషా.
ట్యాలెంట్ ఉన్నా.. శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే?
కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నమెంట్‌లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై జట్టులో పృథ్వీ షా కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో షా తొమ్మిది మ్యాచ్‌ల్లో 197 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అందులో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్‌కు ముంబై జట్టు పగ్గాలు అప్పగించారు. కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీని శ్రేయాస్ అయ్యర్ గెలుచుకున్న తర్వాత, పృథ్వీ షాపై తన అభిప్రాయలను పంచుకున్నాడు. ‘పృథ్వీషాకు ఎంతో ట్యాలెంట్ ఉంది. కానీ ప్రస్తుతం అతనికి గడ్డు కాలం నడుస్తోంది. అతను తన ఆట తీరును మరింత మెరుగుపరుచుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..