Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్‌కు గాయం.. జపాన్ టూర్ క్యాన్సిల్..

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్‌కు గాయం.. జపాన్ టూర్ క్యాన్సిల్..


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. సలార్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్ వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డార్లింగ్ ఆ వెంటనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఏకంగా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది కల్కి సినిమా.ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ అస్సలు గ్యాప్ తీసుకోకుండా యమా బిజీగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఓకే చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇది కూడా చదవండి :Tollywood : అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ హీరోయిన్

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా హారర్ నేపథ్యంలో ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్ డిఫరెంట్ లుక్స్ రిలీజ్ చేశారు. ప్రభాస్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ కు గాయం అయ్యిందని తెలుస్తుంది. కల్కి 2898 ఏడీ సినిమాను ఇప్పుడు జపాన్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా జపాన్ రిలీజ్‌కు సందర్భంగా ప్రమోషన్స్‌లో ప్రభాస్ అండ్ టీమ్ జపాన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..! ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..

అయితే గాయం కారణంగా ప్రభాస్ జపాన్ వెళ్లలేకపోతున్నారు. గాయం కారణంగా 18న జరగాల్సిన కల్కి జపాన్ ప్రీమియర్ కు హాజరు కాలేకపోతున్నారు ప్రభాస్. ప్రభాస్ కు బదులు దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక్కరే హాజరవుతున్నారని తెలుస్తుంది.  ఈ నేపథ్యంలో జపాన్‌ అభిమానుల కోసం ఓ పోస్టును విడుదల చేశారు. “నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా.. కానీ, మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయమవడంతో రాలేకపోతున్నా” అని ప్రభాస్ తెలిపారు. ‘కల్కి 2898 ఏడీ’ 2025 జనవరి 3న విడుదలకానుంది. ప్రభాస్ గాయం అని తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :హేయ్..! మళ్ళీరావా పాప నువ్వేనా ఇది.. హీరోయిన్స్ కుళ్ళుకునేలా మారిపోయిందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *