పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు బాలీవుడ్ నటీమణులు సైతం పోటీ పడుతుంటారు. ఎందుకంటే ప్రభాస్ తో కలిస్తే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పటికే శ్రద్ధా కపూర్, కృతి సనన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి బాలీవుడ్ స్టార్ నటీమణులు ప్రభాస్ సినిమాల్లో నటించారు. అయితే ఇప్పుడు ఓ ప్రముఖ నటి ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిందట. అయితే అది ప్రభాస్ వల్ల కాదు ఆ సినిమా దర్శకుడి కారణంగా. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచినా అతని దర్శకత్వ తీరుపై గతంలో విమర్శలు వచ్చాయి. సందీప్ తన సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుందనే అపవాదు ఉంది. అలాగే మహిళలను హీరోలకు బానిసలుగా, తక్కువ చేసి చూపిస్తారనే విమర్శలు వినిపించాయి. తన యానిమల్ సినిమా 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినా పలువురు ప్రముఖులు ఈ మూవీని వ్యతిరేకించారు. సందీప్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ కారణాలతోనే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ సందీప్ రెడ్డి వంగా సినిమాలో నటించనని చెప్పిందట.
అనివార్య కారణాల వల్ల పోలీసు పదవిని పోగొట్టుకున్న ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథగా స్పిరిట్ తెక్కనుందని సమాచారం. కథానాయిక పాత్రలకు ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. నయన తార, త్రిష.. ఇలా చాలా మంది పేర్లు వచ్చాయి. ఇక కొన్ని రోజులుగా స్పిరిట్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడీ ఆఫర్ ను బాలీవుడ్ బ్యూటీ రిజెక్ట్ చేసిందని సమాచారం.
డెకాయిట్ సినిమాలో మృణాళ్ ఠాకూర్..
View this post on Instagram
మృణాల్ ఠాకూర్ మొదట హిందీ నటి అయినప్పటికీ ప్రస్తుతం తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోది. ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా ‘సీతా రామం’ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ సినిమా కూడా మృణాళ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. విజయ్ దేవర కొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ లోనూ సందడి చేసింది. ఇప్పుడు అడివిశేష్ సినిమాలోనూ కథానాయికగా నటిస్తోంది. అలాగే నాలుగు హిందీ సినిమాలతోనూ బిజి బిజీగా ఉంటోంది.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.