దివంగత నటుడు రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ కుటుంబం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు. ఇందుకోసం ఇటీవలే కపూర్ ఫ్యామిలీ ఢిల్లీ వెళ్లి మోడీని ప్రత్యేకంగా కలిసింది. కరీనా కపూర్, నీతూ కపూర్, కరిష్మా కపూర్, రణబీర్ కపూర్, అలియా భట్, రిద్ధిమా కపూర్ సహానీ, సైఫ్ అలీ ఖాన్ అందరూ మోడీని కలిశారు. ఆయనతో సరదాగా ముచ్చటించారు. తాజాగా ప్రధానితో జరిగిన సంభాషణను దేవర విలన్ సైఫ్ అలీఖాన్ పంచుకున్నారు. ‘పార్లమెంటు సమావేశాల తర్వాత మమ్మల్ని కలవడానికి మోదీ గారు వచ్చారు. కాబట్ అప్పటికే వారు కాస్త అలసిపోయి ఉంటారని నేను ఊహించాను. కానీ ఆయన మా అందరినీ చూడగానే నవ్వుతూ చాలా బాగా మాట్లాడారు. కరీనా, కరిష్మా, రణబీర్.. అంటూ పేరు పేరునా పలకరించారు. మోడీని ఇలా కలవడం కపూర్ కుటుంబానికి చాలా గౌరవప్రదమైన విషయం’.
“ఈ పర్యటనలో ప్రధాని మోడీ వ్యక్తిగతంగా నా తల్లిదండ్రుల గురించి అడిగారు. అలాగే నా బిడ్డలు తైమూర్ , జహంగీర్
ల గురించి కూడా ప్రస్తావించారు. అలాగే ఆయన మాకోసం ఒక స్పెషల్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ప్రధాని హోదాలో మన దేశాన్నిఅభివృద్ధి చేసేందుకు మోడీ చాలా కష్టపడుతున్నారు. ఆయన నిత్యం ప్రజలను కలిసేందుకు తన సమయాన్ని వెతుక్కుంటున్నారు. రోజులో ఎంత సేపు విశ్రాంతి తీసుకుంటారని నేను మోడీని అడిగాను. రాత్రిపూట మూడు గంటలు మాత్రమే నిద్రపోతారని తెలిసి ఆశ్చర్యపోయాను. ప్రధాని మోడీని కలవడం మాకెంతో ప్రత్యేకం. మా కోసం సమయాన్ని వెచ్చించి, మా కుటుంబాన్ని ఇంతగా గౌరవించినందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అని సైఫ్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోడీతో కపూర్ ఫ్యామిలీ..
“Aapne itni achchi energy hai, aur aap itni mehnat karte hain…thanks for opening your door aur itne acccessible hone ke liye” : Actor Saif Ali Khan to PM Narendra Modi.
It seems unlikely that a Prime Minister would ever be as accessible to the public as a prominent actor like… pic.twitter.com/oRn9rQdnCL
— Sparsh Upadhyay (@ISparshUpadhyay) December 11, 2024
రాజ్ కపూర్ 100వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 15 వరకు ప్రత్యేక చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేశారు. RK ఫిల్మ్స్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా రాజ్ కపూర్ నటించిన కొన్ని సినిమాలు మరోసారి థియేటర్లలో విడుదల కానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..