Pillow change: దిండును ఎన్ని రోజులకు మార్చుకోవాలి? లేదంటే ఏమౌతుంది?

Pillow change: దిండును ఎన్ని రోజులకు మార్చుకోవాలి? లేదంటే ఏమౌతుంది?


మన ఆరోగ్యం విషయంలో పడక గది కూడా ఎంతో పాత్ర పోషిస్తుంది. నిత్యం ఉపయోగించే బెడ్​, దిండు, బెడ్​ షీట్లు శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అంతేకాకుండా కంఫర్ట్​ కూడా ముఖ్యమే.. అందుకోసం వాటిని తరచూ మారుస్తుండటం ఎంతో అవసరం. ఎందుకంటే దిండ్లు కొన్ని రోజలకు వాటి ఆకారాన్ని కోల్పోతాయి. పడుకునేటప్పుడు అవి ఇబ్బంది కలిగిస్తాయి. అందువల్ల వాటిని  మార్చడం ఎంతో అవసరం. కానీ ఎన్ని రోజులకు మార్చాలో కూడా తెలియాలి. అదే ఇప్పుడు చూద్దాం.

చర్మ వ్యాధుల ముప్పు

చర్మవ్యాధి నిపుణుల ప్రకారం పాత దిండుల్లో దుమ్ము, మైట్స్​, ఆయిల్​, మృత చర్మ కణాలు ఉంటాయి. ఇవి అలర్జీ, చర్మ సంబంధ వ్యాధులతో పాటు గజ్జిని కూడా కలిగించే అవకాశం ఉంది. అందుకే మనం రోజూ ఉపయోగించే దిండును మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, దిండు సరైన షేప్​లో లేకపోయినా ఇబ్బందులు తప్పవు. వెన్నెముక, మెడ వంటి ప్రాంతాల్లో సమస్యలు వస్తాయి. వాటి అలైన్​మెంట్​లో తేడాలు వచ్చి తలనొప్పి, దీర్ఘకాలిక మెడ నొప్పి, బాడీ పోస్టర్​లోనూ మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు.

రెండేళ్లకు ఓసారి మారిస్తే..

అందుకే దిండును కనీసం ఒకటి నుంచి రెండేళ్లకైనా మార్చడం ఎంతో అవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకుముందే దిండు గట్టి పడినా, ఫ్లాట్​గా అవ్వడం లేదా రంగు మారితే వెంటనే మార్చాల్సిన అవసరం ఉంది.

చెత్తలో పడేయకుండా..

ఇలా దిండులు, బెడ్లను మార్చినప్పుడు వాటిని చెత్తలో పడేయకుండా ఉపయోగకరంగా వాడితే బాగుంటుంది. అంటే ఆశ్రమాలు లేదా జంతుశాలలకు ఇస్తే ఒకరికి సాయం చేయడంతో పాటు పర్యావరణ పరంగానూ ఎంతో మేలు జరుగుతుంది. సింథటిక్స్​తో తయారు చేసిన దిండులను రీసైకిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకోసం కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. కాటన్​ లేదా ఇతర ఆర్గానిక్​ పదార్థాలతో తయారైనవి సహజంగానే డికంపోజ్​ అవుతాయని కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్​ ఉండదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *