సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ నటించిన టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్ 7/G. హరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సోనియాతోపాటు స్మృతి వెంకట్, సిద్ధార్థ్ విపిన్ కీలకపాత్రలు పోషించగా.. ఈ చిత్రానికి సిద్ధార్థ్ విపిన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల జులైలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగా భయ పెట్టింది. వసూళ్లు కూడా ఓ మోస్తరుగానే వచ్చాయి. ఆ తర్వాత ఆగస్టులో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఆగస్టు 09 నుంచి ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. అయితే కేవలం తమిళ్ వెర్షన్ ను మాత్రమే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి నుంచే 7/G సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
7/G చిత్రానికి హరూన్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత హీరోయిన్ సోనియా తనదైన నటనతో మెప్పించింది. గతంలో తెలుగులో సూపర్ హిట్ అయిన 7G బృందవన్ కాలనీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనియా.. ఇప్పుడు మళ్లీ దాదాపు అదే టైటిల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక 7/G సినిమా కథ విషయానికి వస్తే.. రాజీవ్, వర్ష అనే దంపతులు ఐదేళ్ల కొడుకు రాహుల్‌తో కలసి కొత్త ఫ్లాట్‌కి మారుతారు. అక్కడ వర్ష పారానార్మల్ యాక్టివిటీస్ ని ఎదుర్కొంటుంది. వారి ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతీంద్రియ శక్తులతో వర్ష ఎలాంటి పోరాటం చేసిందనే చాలా ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో ఉంచే థ్రిల్లర్ గా చూపించారు. ప్రేక్షకులని కట్టిపడేసే ఈ హారర్ థ్రిల్లర్ ని ఆహా ఓటీటీలో ఎట్టిపరిస్థితిలో మిస్ కావద్దు.
ఆహాలో స్ట్రీమింగ్..
A family’s dream home turns into a nightmare!
Will they survive the paranormal forces or flee?
Watch Now on aha https://t.co/idGMAGB6xz#7G #7Gmovie #soniaagarwal #smruthivenkat #Haroon #aha pic.twitter.com/qzJeZpQCTl
— ahavideoin (@ahavideoIN) December 12, 2024
Switch to ‘7/G – The Dark Story’
Stay connected on this Thursday! pic.twitter.com/Fa3NruRrh4— ahavideoin (@ahavideoIN) December 10, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.