ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టార్‌గా కనిపించబోతున్నారు. ఆల్రెడీ కొంత పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రీసెంట్గా రీస్టార్ట్ అయ్యింది.
త్వరలో పవన్ కూడా టీమ్‌తో జాయిన్ అవ్వబోతున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమాలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఓజీ సినిమా దర్శకుడు సుజిత్ గతంలో ప్రభాస్ హీరోగా సాహో సినిమాను రూపొందించారు. ఈ సినిమా నార్త్‌లో బిగ్ హిట్ అయ్యింది. అందుకే ఆ పరిచయంతోనే ఓజీ కోసం ప్రభాస్‌ను రంగంలోకి దించుతున్నారన్నది ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న న్యూస్.
పవన్ వారసుడు అకీరా నందన్ కూడా ఓజీతోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. ఓ ఇంపార్టెంట్ రోల్లో అకీరా కనిపిస్తారని, ఆ సీన్స్ సినిమాకే హైలెట్ అవుతాయంటూ సోషల్ మీడియాలో మోత మోగించారు మెగా ఫ్యాన్స్. కానీ ఈ వార్తలపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయ్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తారన్నది లేటెస్ట్ అప్డేట్. చరణ్, పవన్ మధ్య ఉన్న అనుబంధం గురించి ఆల్రెడీ అభిమానులకు బాగా తెలుసు. అందుకే ఈ కాంబోను తెర మీద చూసేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ కోరిక ఓజీ తీరబోతుందన్నది ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్న నయా న్యూస్. అయితే ఈ న్యూస్ ఇంతగా ట్రెండ్ అవుతున్నా.. యూనిట్ సైడ్ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావటం లేదు.