ఇక పేరుకు కన్నడ నటుడే అయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు నిఖిల్. కంటెస్టెంట్స్ సూటి పోటి మాటలు అన్నా ఆటతోనే సమాధానం చెప్పాడు. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే నిఖిల్ కు తిరుగులేకుండా పోయింది. దీంతో మొదటి నుంచి ఈ సీరియల్ నటుడిని బిగ్ బాస్ టైటిల్ ఫేవరేట్ గా భావించారు. ఇప్పుడు అదే నిజమైపోయింది. ఇక బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 55 లక్షల రూపాయల చెక్కును అందుకున్నాడు నిఖిల్. ఈ మొత్తంతో పాటు బ్రాండ్ న్యూ మారుతీ డిజైర్ కార్‌ను కూడా గెలుచుకున్నాడు ఈ సీరియల్ హీరో. ప్రైజ్ మనీయే కాకుండా… బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు నిఖిల్ వారానికి ఏకంగా రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన మొత్తం పదిహేనువారాలకుగానూ 33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు నిఖిల్ సొంతం చేసుకున్నాడని సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాళ్లకో రూల్.. బన్నీకో రూలా ?? సుమన్ షాకింగ్ కామెంట్స్
పెళ్లికి రెడీ అయిన సీరియల్ హీరోయిన్
టైటిల్ కొట్టకపోయినా.. డబ్బులు బాగానే రాబట్టుకున్న ఓరుగల్లు బిడ్డ
నేను ముందే చెప్పా కదా.. అల్లు అర్జున్
నల్లగా ఉన్నావంటూ జోకులు.. ఇచ్చిపడేసిన డైరెక్టర్