Nemo E-Scooter: 17 పైసలతో కిలోమీటరు ప్రయాణం..! ఆ ఈవీ స్కూటర్‌తో సాధ్యం

Nemo E-Scooter: 17 పైసలతో కిలోమీటరు ప్రయాణం..! ఆ ఈవీ స్కూటర్‌తో సాధ్యం


నమో స్కూటర్ ఒక్కసారి రీచార్జి చేస్తే సుమారు 130 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. పట్టణ వాసుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. ఈ స్కూటర్ చాాలా తేలికగా ఉండడం వల్ల ట్రాఫిక్ రద్దీలో చాలా సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు. ఎకో, స్పోర్ట్, హైపర్ అనే మూడు రకాల డ్రైవింగ్ మోడ్ లలో అందుబాటులో ఉంది. కొత్త స్కూటర్ లో 1500 డబ్ల్యూ సామర్థ్యం కలిగిన బీఎల్ డీసీ మోటారు ను ఏర్పాటు చేశారు. మూడు రకాల స్పీడ్ కంట్రోల్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. గంటకు 65 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఆకర్షణీయమైన సిల్వర్, వైట్ కలర్ స్కీములలో నెమో విడుదలైంది. నెమో స్కూటర్ లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఏర్పాటు చేశారు. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు డ్యూయల్ షాక్ అబ్జార్వర్ అమర్చారు. రెండు వైపులా హైడ్రాలిక్ బ్రేకులతో వాహనాన్ని సమర్థవంతంగా నియంత్రణ చేయవచ్చు. వీటితో పాటు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ పై ప్రయాణం చేయడానికి కిలోమీటరుకు కేవలం 17 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. పూర్తి చార్జింగ్ తో దాదాపు 130 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఈ స్కూటర్ లో ఎల్ఈడీ యూనిట్ తో ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్, ఐదు అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్డీ డిస్ ప్లే, స్మార్ట్ సీఏఎన్ కలిగిన బ్యాటరీ సిస్టమ్ రిమోట్ పర్యవేక్షణ, ట్రాకింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే మొబైల్ పరికరాలను చార్జింగ్ చేసుకోవడానికి యూఎస్ బీ పోర్టు, పార్కింగ్ స్థలం నుంచి స్కూటర్ ను బయటకు తీయడంలో రైడర్ కు సహాయ పడే రివర్స్ అసిస్ట్ ఫీచర్ కూడా ఏర్పాటు చేశారు. కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తా మాట్లాడుతూ జాయ్ ఇ బైక్ కేటగిరీ కింద నెమో స్కూటర్ ను ప్రారంభించినట్టు చెప్పారు. తమ పోర్ట్ పోలియోలోని బలపేతం చేయడంతో పాటు వినియోగదారులు ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దినట్టు వెల్లడించారు. స్థిరమైన, సమర్థవంతమైన, వినూత్నమైన రవాణా సాధనాన్ని కోరుకునేవారికి నెమో స్కూటర్ మంచి ఎంపిక అవుతుందన్నారు.

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండడంతో పాటు పెట్రోలు ధరల బాధ లేకపోవడంతో వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు అన్ని రకాల ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ఈ విభాగంలో తమ వాహనాలను విడుదల చేస్తున్నాయి. రానున్న పదేళ్లలో ఈ రంగం విపరీతంగా ప్రగతి సాధిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *