న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్ష- అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) సిలబస్ 2025ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లోని అంశాలను యూనిట్ల వారీగా నీట్ యూజీ-2025 నూతన సిలబస్‌లో పొందుపరిచారు. ఈ పరీక్ష వచ్చే ఏడాది మే నెలలో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. విద్యార్థులు సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కింది లింక్ ద్వారా డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ 2024 సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరోమైపు నీట్- యూజీ పరీక్ష విధానంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈసారి పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెట్టాలా లేదంటే ఆన్ లైన్ విధానంలోనే కొనసాగించాలా అనే దానిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్చిస్తోంది. కాగా గత నీట్ యూజీ 2024 పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీలు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఆర్‌పీఎఫ్ ఎస్సై ఎగ్జామ్ కీ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు ఇదే
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఇటీవల నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను రైల్వే శాఖ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, యూజర్ పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను కేవలం ఆన్‌లైన్‌లోనే తెల్పవల్సి ఉంటుంది. అభ్యంతరాలు లేవనెత్తడానికి డిసెంబర్ 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో మొత్తం 452 సబ్ ఇన్‌స్పెక్టర్ కొలువుల భర్తీకి గత మేలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
ఆర్‌పీఎఫ్ ఎస్సై ఎగ్జామ్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.