NDuro electric scooter: సామాన్యుడి ఈవీ వచ్చేసిందోచ్.. కేవలం రూ.60 వేలకు బెస్ట్ స్కూటర్..!

NDuro electric scooter: సామాన్యుడి ఈవీ వచ్చేసిందోచ్.. కేవలం రూ.60 వేలకు బెస్ట్ స్కూటర్..!


ఎస్ఏఆర్ గ్రూపునకు చెందిన ఇమెబిలిటీ విభాగమైన లెక్ట్రిక్స్ ఎలక్ట్రిక్ నుంచి ఈ కొత్త స్కూటర్ విడుదలైంది. ముఖ్యంగా అర్బన్ ప్రజల అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పట్టణ వాసులతో పాటు అడ్వెంచర్లు చేయాలనుకునే వారికి ఉపయోగంగా ఉంటుంది. స్టోర్టివ్ లుక్, సొగసైన డిజైన్ తో ఆకట్టుకుంటోంది. ఎన్ డ్యూరో స్కూటర్ ప్రత్యేకతల విషయానికి వస్తే గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. కేవలం 5.1 సెకన్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. రెండు రకాల బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. వీటిలో 2.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ 90 కిలోమీటర్లు, 3.0 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 117 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. 42 లీటర్ బూట్ స్పేస్ తో నిల్వ సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.57,999. మొదటి వెయ్యి మంది కస్టమర్లకు బ్యాటర్ యూజ్ ఏ సర్వీస్ (బీఏఏఎస్) అందుబాటులో ఉంది.

స్కూటర్ లో అధునాతన స్మార్ట్ కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉన్నాయి. ఎఫిషియెన్సీ బార్, హిల్ హుల్డ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ ఎస్వోఎస్, డిటైల్డ్ రైడ్ అనలిటిక్స్, రియల్ టైమ్ థెప్ట్ అలెర్ట్ తదితర ఫీచర్లు ఏర్పాటు చేశారు. ఎస్ఏఆర్ గ్రూప్ వ్యవస్థాపకుడు రాకేష్ మల్హోత్రా మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్ ను రూపొందించామన్నారు. పట్టణాల్లోని ట్రాఫిక్ రద్దీలో సులభంగా డ్రైవింగ్ చేసేలా, స్లైలిష్ లుక్ తో , తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ స్కూటర్ ను సామాన్యులు కూడా కొనగలిగే అవకాశం ఉందని, వారి అన్ని అవసరాలను తీర్చుతుందన్నారు.

లెక్ట్రిక్స్ స్కూటర్ బ్యాటర్ యూజ్ ఏ సర్వీస్ మోడల్ లో అగ్రగామిగా కొనసాగుతుంది. ఈ విధానంలో స్కూటర్ బ్యాటరీని నెలవారీగా అద్దెకు తీసుకోవచ్చు. సాధారణంగా స్కూటర్ ధరలో బ్యాటరీ రేటు అధికంగా ఉంటుంది. బీఏఏఎస్ విధానం ద్వారా దాదాపు 40 శాతం వరకూ రేటు తగ్గుతుంది. అలాగే స్వాప్ స్టేషన్లలో బ్యాటరీలను త్వరగా మార్చుకోవచ్చు. దీనికోసం ఈ కంపెనీ ఇప్పటికే పదివేల బ్యాటరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని పరిధిలో 15 వేల స్కూటర్లు, 30 వేల త్రీ వీలర్లు ఉన్నాయి. ఎన్ డ్యూరో స్కూటర్ ఫ్లిప్ కార్డ్ లో కూడా అందుబాటులో ఉంది. నెలవారీ సులభ ఈఎంఐలతో కొనుగోలు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *