Nayanthara: అతని కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా.. షాకింగ్ విషయం చెప్పిన నయన్

Nayanthara: అతని కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా.. షాకింగ్ విషయం చెప్పిన నయన్


స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పవర్ ఫుల్ పాత్రలతో ‘లేడీ సూపర్ స్టార్’గా గుర్తింపు పొందింది ఈ అందాల భామ. నయన్ గురించి చాలా మంది తెలిసే ఉంటుంది. ఆమె సినీ లైఫ్ తో పాటు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలిచింది. 2011 లో నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకున్న విషయం మీకుతెలుసా.? అవును అప్పుడు నయనతార సినిమాలకు పూర్తిగా దూరం అవ్వాలని అనుకుంది. ఆతర్వాత రెండు సంవత్సరాలు సైలెంట్ గా ఉంది. కానీ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయ్యింది. ఇప్పుడు ఆమె ఓ స్టార్ హీరోయిన్. నయనతార ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి కవల పిల్లలు ఉన్నారు. నయనతార జీవితంలోకి విఘ్నేష్ రాకముందు, ఆమె కొరియోగ్రాఫర్, డాన్సర్ మరియు దర్శకుడు ప్రభుదేవాతో డేటింగ్ చేసేది.

ఇది కూడా చదవండి :Tollywood : అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ హీరోయిన్

అప్పట్లో ప్రభు దేవ ప్రేమ కోసం తన నటనా జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు నయనతార వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. “ గతంలో నా జీవితంలో ప్రేమ కావాలంటే, నేను కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని నేను భావించే దశలో ఉన్నాను. ఆ సమయంలో నేను చాలా సున్నితంగా ఉండేదాన్ని. మా ఇండస్ట్రీలో చాలా రిలేషన్స్‌ని చూశాను. వారు చెడ్డవారని నేను చెప్పడం లేదు, కానీ అది ఆ విధంగా ఉండటం మేము చూశాము. అందుకే ఆ సమయంలో ఓకే అనుకున్నాను. ప్రేమ కావాలంటే ఎక్కడో ఒకచోట రాజీ పడాల్సిందేనని నాలోని నిజాయితీ గల అమ్మాయి భావించింది అని నయన్ అన్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..! ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..

అలాగే ఆమె మాట్లాడుతూ..  మీరు మీ అన్నింటినీ మీ ప్రేమకోసం వదులుకోవాలి. మీరు చేస్తున్న పని మీ భాగస్వామికి నచ్చకపోతే, మీరు దానిని వదులుకోవాలి. ఆ సమయంలో ప్రేమపై నాకున్న అవగాహన అదే. కానీ నేను ఆతర్వాత స్ట్రాంగ్ అయ్యాను. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే ఆ బంధం వల్లనే. ఆ బంధం లేకుంటే ఇంత దూరం వచ్చేంత శక్తి నాకు ఉండేది కాదు. నాకు ఎంత సామర్థ్యం ఉందో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ సంబంధం తర్వాత, నేను ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మార్చుకున్నాను” అని నయనతార చెప్పుకొచ్చింది. అదేవిధంగా  “సినిమా అనేది వ్యాపారం మాత్రమే కాదని నేను గ్రహించాను. ఇది డబ్బు, కీర్తి గురించి మాత్రమే కాదు. కానీ అది నా జీవితంలో అంతర్భాగమైపోయింది. ఇది నేను నటించడానికే పుట్టాను. ఆఖరికి ‘శ్రీరామరాజ్యం’ చేసినప్పుడు సినిమాలకు దూరంగా ఉండలేనని అర్థమైంది’’ అని నయనతార చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి :హేయ్..! మళ్ళీరావా పాప నువ్వేనా ఇది.. హీరోయిన్స్ కుళ్ళుకునేలా మారిపోయిందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *