Nandyal: హిజ్రాలతో సన్నిహితంగా కుమారుడు.. తల కొట్టేసినట్లు అనిపించడంతో.. అతని పేరెంట్స్..

Nandyal: హిజ్రాలతో సన్నిహితంగా కుమారుడు.. తల కొట్టేసినట్లు అనిపించడంతో.. అతని పేరెంట్స్..


నంద్యాలలో ఆ దంపతులు పూలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఒక్కడే కుమారుడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. రూపాయి.. రూపాయి కూడబెట్టి.. తనయుడ్ని బీటెక్ చదివించారు. అయితే చదువు పెద్దగా రాకపోవడంతో.. ఆటో కొనివ్వమని తనయుడు కోరడంతో కొనిపెట్టారు. అయితే అతను చెడు తిరుగుళ్లు తిరుగుతున్న విషయాన్ని మాత్రం వారు గుర్తించలేకపోయారు. ఆటో డ్రైవర్‌గా అతని ప్రయాణం హిజ్రాలతో పరిచయం, సాన్నిహిత్యానికి దారితీసింది. ఆపై హిజ్రాలు ఇంటికి రావడం కూడా ప్రారంభించారు. దీంతో ఆ దంపతులకు తల కొట్టేసినట్లు అయింది. కొడుకును మందలించినా ఫలితం లేకపోయింది. పెళ్లి చేసుకుని తమకు ఆసరాగా నిలవమని వారు కోరినా.. అతని బుద్ది మారలేదు. దీంతో తల్లిదండ్రులకు తనయులకు మధ్య.. తరచూ గొడవలు జరిగేవి. కౌన్సిలింగ్ ఇప్పించినా అతనిలో నో ఛేంజ్. ఫైనల్‌గా నాకు వాళ్లే కావాలి.. మీరు అక్కర్లేదు అని తెగేసి చెప్పాడు తనయుడు. వారితోనే కలిసి ఉంటానని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో వారు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇన్నాళ్లు తమను ఉద్దరిస్తాడని.. మంచి పేరు తెస్తాడని ఆశలు పెట్టుకున్న కోడు ఛీ పొమ్మనడంతో.. వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

తమ బాధను ఎవరితో పంచుకోలేక.. సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక మానసిక సంఘర్షణకు లోనై.. గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టంత కుమారుడు ఉన్నా మార్చురీ గదిలో అనాథ శవాల మాదిరిగా వారిని చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. బిడ్డలు కనగలం కానీ వారి బుద్ధులు కనలేం కదా.. అని మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *