Mystery Temple: ఈ కోనలో వెలసిన నృసింహస్వామికి నారద, తుంబురుడు రోజూ పూజలు.. సాక్ష్యంగా తులసీదళాలు.. ఆలయం ఎక్కడంటే..

Mystery Temple: ఈ కోనలో వెలసిన నృసింహస్వామికి నారద, తుంబురుడు రోజూ పూజలు.. సాక్ష్యంగా తులసీదళాలు.. ఆలయం ఎక్కడంటే..


బ్రహ్మ మానస పుత్రుడు, త్రిలోక సంచారి, కలహాభోజనుడు అయిన నారద మహర్షి వారు.. అలాగే సంగీతానికి అది గురువుగా చెప్పుకునే తంబుర మహర్షి వారు …. ఇద్దరు ప్రతిరోజు ఒక దేవాలయంలో రాత్రి సముయంలో వచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చన చేసి వెళతారని ఒక ప్రతీతి. ప్రతిరోజు అర్చన చేసి స్వామి వారి దగ్గర తులసి దళాలను పెట్టి వెళతారంట. మరి అలాంటి మహామహిమనిత్వం ఆలయం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది.

కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి చెందిన పెండ్లిమర్రి మండలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ స్వామి వారు స్వయంభుగా వెలిశారు. నరసింహ స్వామి అవతారంలో హిరణ్యకశిపుడిని వధించిన తరువాత స్వామి వారు ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ స్వయంభుగా వెలిశారని స్థల పురాణం. ఆ తరువాత జనమే జయ మహారాజు కాలములో ఈ క్షేత్రము నిర్మాణ దశను పూర్తిచేసుకుని అప్పటినుంచి విరాజిల్లుతుంది. అచ్యుతరాయల వారు దండయాత్రకు వెళుతూ ఈ స్వామి వారిని దర్శించుకొని వెళ్లి యుద్ధములో విజయం సాధించుకొని తిరిగి వచ్చి స్వామివారికి కొంత మాన్యము భూమిని ఇక్కడ ఇచ్చినట్లు శాసనాలు ద్వారా తెలుస్తోంది.

అంతేకాదు అన్నమాచార్యుల వారు కూడా స్వామివారిని దర్శించుకుని ఇక్కడ స్వామివారిపై 16 సంకీర్తనలు కూడా రచించారు. ఇది దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విశేషం అంటే స్వయంగా నారద మహర్షి,తంబుర మహర్షి వారు ఇద్దరూ ప్రతిరోజు రాత్రి వేళల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని గర్భగుడికి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రతిరోజు స్వామివారికి అర్చన చేసి వెళ్తారంట. అందుకు నిదర్శనంగా ఆధారాలు కూడా లభిస్తున్నాయి. అవి ఏమిటంటే ప్రతిరోజు ఆలయం గర్భ గుడి తలుపులు తెరిచిన వెంటనే తులసీదళాలు కనిపిస్తాయి.

రాత్రి గుడి శుభ్రం చేసి వెళ్లిపోయిన పూజారి.. మర్నాడు తెల్లవారుజామున స్వామివారి గర్భ గుడి తలుపు తెరిచి చూడగానే ప్రతిరోజు తులసి దళాలు కనిపించడం ఇక్కడ ఆనవాయితీ. ఇవన్నీ చూసిన వారు ఈ ఆలయ స్థలపురాణం ఆధారాలను బట్టి నారద మహర్షి వారు, తుంబుర మహర్షి వారు ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు స్వామివారికి తులసీ దళాలతో పూజలు చేస్తారని నమ్ముతున్నారు. ఇదే విషయంలో ఆలయ స్థల పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయని అంటున్నారు భక్తులు.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *