వర్షాకాలం, చలికాలం ఎప్పుడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు ఎక్కువగా పెరుగుతాయి.. బెడద కూడా రెట్టింపు గానే ఉంటుంది.. అయితే కొందరు ఎక్కువగా దోమ కాటికి గురవుతుంటారు. తమ పక్కన ఉన్నవాళ్లు ఎక్కువ దోమలు కుడుతున్నాయని.. అంటూ ఉంటారు. కానీ పక్కనే ఉన్న మరి కొంతమందికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. దోమలు కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి.. మరికొందరినీ తక్కువగా కుడుతుంటాయి.. అయితే, వీటన్నిటికీ అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. కొందరిని కుట్టకపోవడం, కొందరికి ఎక్కువగా కుట్టడం వెనుక.. దోమల ఆకర్షణకు కారణమైన జీవనశైలి, ఆహారమే ప్రధాన కారణాలని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ ,మలేరియా, చికెన్ గునియా వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు.. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట. మనకు తెలిసిన ఎనిమిది రకాల బ్లడ్ గ్రూపులు వేటికి అవే ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఓ పాజిటివ్ ఓ నెగటివ్ వ్యక్తులను మాత్రమే దోమలు ఎక్కువగా కుడతాయని రీసెంట్‌గా జరిగిన రీసర్చ్‌లో తెలిసింది. ఓ బ్లడ్ గ్రూప్ తో పాటు A బ్లడ్ గ్రూప్ వారినే దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు.. మిగితా బ్లడ్ గ్రూప్ లని తక్కువగా కుడతాయట. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దోమల్లో కేవలం ఆడ దోమ మాత్రమే మనుషులను కుడతాయి.. అలాగని మనిషి రక్తమే వాటి ఆహారం కాదు. వాటి సంతాన ఉత్పత్తి పెరగడం అంటే గుడ్ల కోసం మనుషుల రక్తాన్ని తాగుతాయి.
ఆడ దోమ 200 నుంచి 300 వరకు గుడ్లను పెడుతుంది. అంటే దోమలు వాటి కడుపు నింపు కోవడమే కాకుండా.. వాటి సంతాన అభివృద్ధికి మన రక్తం ఉపయోగపడుతుంది.. మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దాన్నిబట్టి దోమలు తక్కువ లేదా ఎక్కువ ఆకర్షణకు గురవుతాయి.. షుగర్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కీటకాలను ఉత్సాహపరిచేలా శరీరం నుంచి ఒక విధమైన సువాసన వస్తుంది.. కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రత జీవితమే ప్రభావితం చేస్తాయి.. ఇవి కూడా దోమల ఆకర్షణకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.