ఈ నెల 15 నుంచి 19 వ తేదీ వరకు చంద్రుడు వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో అనుకూల సంచారం చేయబోతున్నాడు. ఈ మూడు రాశుల్లో అయిదు రోజుల పాటు జరిపే సంచారంలో చంద్రుడు మూడు ఆదాయ, అభివృద్ధి యోగాలనివ్వడం జరుగుతోంది. గజకేసరి యోగం, పౌర్ణమి యోగం, చంద్రమంగళ యోగాలు వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ఆదాయాన్ని పెంచడంతో పాటు మనసులోని కోరికలు, ఆశలను చాలావరకు తీర్చే అవకాశం ఉంది. ఈ అయిదు రోజుల్లో చేపట్టే ప్రయత్నాలు, నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి.
- వృషభం: ఈ రాశికి ఈ అయిదు రోజుల చంద్ర సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ఫలితంగా ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. మాతృ సౌఖ్యం, మాతృ సంపద లభిస్తాయి. మనసు లోని ఒకటి రెండు ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. కొన్ని ఆస్తి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మనశ్శాంతి లభిస్తుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం కలుగుతుంది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఒత్తిడి, శ్రమ బాగా తగ్గుతాయి.
- మిథునం: ఈ రాశివారికి ఈ మూడు యోగాలూ వర్తిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి పాస్తుల విలువ బాగా పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు అత్యధికంగా లాభాలను పొందుతాయి.
- కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడికి విశేషమైన బలం కలగడం వల్ల మనసులోని ముఖ్యమైన కోరికలు తప్ప కుండా నెరవేరుతాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే ఫలితాలు అంతగా అనుకూ లంగా ఉంటాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాల నిస్తాయి. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అత్యధిక లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.
- కన్య: ఈ రాశికి గజకేసరి, పౌర్ణమి, చంద్ర మంగళ యోగాలు పూర్తి స్థాయిలో పట్టే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఈ మూడు యోగాల వల్ల అంచనాలకు మించి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆస్తి కలిసి రావడం, ఆస్తుల విలువ పెరగడం వంటివి జరుగుతాయి. లాభదాయక ఒప్పందాలు, లావాదేవీలు చోటు చేసుకుంటాయి. ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రావలసిన డబ్బు, బాకీలు పూర్తిగా వసూలవుతాయి.
- తుల: ఈ రాశికి అనుకూల స్థానాల్లో ఈ మూడు ఆదాయ వృద్ధి యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఆదా యపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది.
- మకరం: ఈ రాశికి ఈ మూడు ఆదాయ వృద్ధి యోగాల వల్ల వరుసగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి లాభం, ఆరోగ్య లాభం కలుగుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరు గుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆస్తి కలిసి వస్తుంది.