Mobile Flight Mode: విమానంలో మొబైల్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచకపోతే ఏమవుతుందో తెలుసా?

Mobile Flight Mode: విమానంలో మొబైల్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచకపోతే ఏమవుతుందో తెలుసా?


విమానం ఎక్కిన తర్వాత ప్రయాణికులు తమ ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో ఉంచమని చెబుతారు. ఇలా ఎందుకు ప్లైట్‌ మోడ్‌లో ఉంచమని చెబుతారో మీరు ఆలోచించారా? విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచడానికి పెద్ద కారణం ఉంది. అలా చేయకపోవడం వల్ల విమాన పైలట్‌లు సూచనలను వినడంలో ఇబ్బంది పడుతున్నారని, ఇది విమానంతో పాటు ప్రయాణీకుల ప్రాణాలకు హాని కలిగిస్తుందని చెబుతారు.

పైలట్ చెప్పిన కారణం ఇదే..

టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న వీడియోలో, @perchpoint హ్యాండిల్‌తో ఉన్న పైలట్ టవర్‌కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లు పైలట్ రేడియో కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగిస్తాయని చెప్పారు. అదే సమయంలో అనేక మొబైల్ ఫోన్‌లు టవర్‌కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే, పైలట్ తన రేడియో సెట్‌లో సూచనలను వినడానికి ఇబ్బంది కలిగించవచ్చని అతను చెప్పాడు. ఈ మొబైల్ ఫోన్‌లు రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. ఇవి పైలట్ హెడ్‌సెట్‌లోని రేడియో తరంగాలకు అంతరాయం కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Online Fuel Order: ప్రయాణం మధ్యలో వాహనంలో పెట్రోల్‌ అయిపోయిందా? నో టెన్షన్‌.. ఇలా ఆర్డర్‌ చేయండి

తాజాగా జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చూపుతూ.. ఇలాంటి పరిస్థితి వల్లే తాను ఇబ్బందులు పడాల్సి వచ్చిందని అన్నారు. అతను తన విమానానికి దిశల కోసం కంట్రోల్ టవర్‌ని అడుగుతున్నాడు. కానీ మొబైల్ ఫోన్ నుండి వచ్చే రేడియో తరంగాల కారణంగా అతను సూచనలను స్పష్టంగా వినలేకపోయాడు. దోమ చెవిలోకి ప్రవేశించిన శబ్దంతో పోల్చాడు.

భారతదేశంలోని విమానాలలో ఫ్లైట్ మోడ్‌కు సంబంధించిన మార్గదర్శకాలు ఏమిటి?

భారతదేశంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచనల ప్రకారం.. ప్రయాణికులు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తమ ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. ఈ మార్గదర్శకాల ప్రకారం, ప్రయాణికులు మొబైల్‌తో పాటు ల్యాప్‌టాప్, ట్యాబ్‌తో సహా ప్రతి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. అయితే కొన్ని విమానయాన సంస్థలు తమ విమానం సామర్థ్యం, DGCA నుండి అనుమతిని బట్టి విమానంలో Wi-Fi సౌకర్యాన్ని అందించవచ్చు.

ఇది చదవండి: Airtel Cheapest Plan: ఎయిర్‌టెల్‌ సూపర్‌ ప్లాన్‌.. కేవలం రూ.1999 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *