Mirzapur: వారెవ్వా..! మీర్జాపూర్ గోలు పాప ఇది నువేనా..? అందాలతో మత్తెక్కించిందిగా

Mirzapur: వారెవ్వా..! మీర్జాపూర్ గోలు పాప ఇది నువేనా..? అందాలతో మత్తెక్కించిందిగా


ఓటీటీలో వాడకం ఎక్కువైనా తర్వాత సినిమాలతో పని వెబ్ సిరీస్ ల హడావిడి కూడా ఎక్కువైంది. సినిమాలతో పోల్చుకుంటే వెబ్ సిరీస్ లే ఎక్కుగా విడుదలవుతున్నాయి. చాలా మంది హీరో, హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అలాగే కొంతమంది సీనియర్ హీరోయిన్స్, హీరోలు వెబ్ సిరీస్ లతో రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక వెబ్ సిరీస్ ల్లో ట్రేడ్ మార్క్ గా నిలిచిన సిరీస్ ఏది అంటే టక్కున చెప్పే పేరు మీర్జాపూర్. ఈ సిరీస్ చూడని ప్రేక్షకులు ఉండరు. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సిరీస్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సిరీస్ ఇప్పటికే ముందు సీజన్స్ విడుదలైంది.

ఇది కూడా చదవండి :Tollywood : అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ హీరోయిన్

ఇక ఈశ సిరీస్ లో ప్రతి పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి సీజన్‌లో, ప్రధాన తారాగణం పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, విక్రాంత్ మాస్సే, శ్వేతా త్రిపాఠి, శ్రియా పిల్‌గాంకర్, రసిక దుగల్, హర్షిత గౌర్, కులభూషణ్ ఖర్బందా ఇలా చాలా మంది నటించారు. అలాగే సీజన్ 2లో కొంతమంది యాడ్ అయ్యారు.  రెండవ సీజన్‌లో విజయ్ వర్మ, ఇషా తల్వార్, లిల్లిపుట్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, అనంగ్షా బిస్వాస్, నేహా సర్గమ్‌లు నటించారు.

ఇది కూడా చదవండి : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..! ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..

కాగా మీర్జాపూర్ సిరీస్ లో గజ్గామిని “గోలు” గుప్తా గా నటించిన చిన్నది గుర్తుందా.? ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పేరు శ్వేతా త్రిపాఠి.  ఆమె ప్రొడక్షన్ అసిస్టెంట్ మరియు అసోసియేట్ డైరెక్టర్‌గా చేసింది. ఈ చిన్నది బాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా చేసింది. ఇక మీరాపూర్ సిరీస్ లో ఆమె చేసిన గోలు పాత్రతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి :హేయ్..! మళ్ళీరావా పాప నువ్వేనా ఇది.. హీరోయిన్స్ కుళ్ళుకునేలా మారిపోయిందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *