Mega Brothers: అన్న అప్పుడు.. తమ్ముళ్లు ఇప్పుడు.! మెగా బ్రదర్స్.. మెగా హిట్..

Mega Brothers: అన్న అప్పుడు.. తమ్ముళ్లు ఇప్పుడు.! మెగా బ్రదర్స్.. మెగా హిట్..


చిరు తర్వాత నాగబాబు నటుడిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగించగా.. ఆ తర్వాత వచ్చిన పవన్ కల్యాణ్.. పవర్ స్టార్‌గా ఇండస్ట్రీని శాసిస్తూ వస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్ల వారసులు గురించి వారి.. సక్సెస్ గురించి.. ఇప్పుడు పెద్దా చెప్పుకోవాల్సిన పని లేదు. దాన్ని మనం సిల్వర్ స్క్రీన్‌పై చూస్తున్నాం కూడా. ఇప్పుడు విషయమేంటంటే.. అయితే ఈ మెగా బ్రదర్స్ కేవలం సిల్వర్ స్క్రీన్‌మాత్రమే తమను తాము ప్రూవ్ చేసుకోవడం కాదు.. కాస్త ఆలస్యమైనా సరే రాజకీయాల్లోనూ తమను తావు ప్రూవ్ చేసుకున్నట్టే.

నిజానికి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే పొలిటికల్ సక్సెస్‌ను మెగా బ్రదర్స్ చూస్తారనే తెలుగు ప్రజలంతా భావించారు. పార్టీ పెట్టిన తర్వాత జనంలోకొచ్చిన చిరంజీవిని చూసేందుకు వెల్లువలా వచ్చిన జనాన్ని చూసి అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్దండ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు భయపడ్డ మాట వాస్తవమే. కానీ క్రమంగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మెగా ఫ్యామెలీ ఆశలు ఒక్కొక్కటిగా కరుగుతూ వచ్చాయి. అందుకు కారణాలు చాలా అంటే చాలా ఉన్నాయి. చివరకు ఎన్నికల ఫలితాలొచ్చేసరికి ముఖ్యమంత్రి అవుతారని భావించిన చిరంజీవి కేవలం 18 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావడం.. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన చిరు సోదరుడు నాగబాబు ఓడిపోవడం.. అప్పటికింకా యువరాజ్యాన్ని లీడ్ చేస్తున్న పవన్ కల్యాణ్ రాజకీయ అరంగ్రేటం చెయ్యకపోవడంతో ఓ రకంగా మెగా రేంజ్‌లో పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న మెగా ఫ్యామెలీ ఆశలకు కాస్త బ్రేక్ పడింది. కేవలం చిరంజీవి మాత్రమే తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెల్చి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అనగల్గారు. ఆ తర్వాత ఎపిసోడ్‌లో జరిగిన నాటకీయ పరిణామాలు ప్రజారాజ్యం అనే పార్టీని పూర్తిగా కనుమరుగు చేసినప్పటికీ చిరంజీవిని మాత్రం కేంద్ర మంత్రిని చేశాయి. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చెయ్యడం.. ఆ తర్వాత సోనియా గాంధీ చిరంజీవికి రాజ్యసభకు ఎంపీగా పంపి, కేంద్ర పర్యాటక మంత్రిని చెయ్యడంతో మొదటి సారి మెగా ఫ్యామెలీ నుంచి మెగాస్టారే మంత్రి అయ్యారు.

ఇక ఆ తర్వాత వంతు పవన్ కల్యాణ్‌ది. ఈ విషయంలో అన్నతో పోల్చితే పవర్ స్టార్‌కున్న పట్టుదలే ఆయన్ను కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయంగానూ శిఖరాగ్ర స్థానానికి తీసుకొచ్చింది. జనసేన పార్టీ పెట్టి పదేళ్ల పాటు కనీసం అసెంబ్లీ ఛాయలకు కూడా వెళ్లలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఒక్క స్థానంలో విజయం సాధించినప్పటికీ ఆ ఎమ్మెల్యే కూడా నాటి అధికార పార్టీలో కలిసిపోవడంతో.. అసెంబ్లీలో జనసేన ఉనికే లేకుండా పోయింది. ఈ పదేళ్లలో ఆయన పార్టీని నమ్ముకొని.. ఆయన్ను నమ్ముకొని లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయనతోనే ఉండటం.. పవన్ కల్యాణ్ పదేళ్ల రాజకీయ జీవితంలో తగిలిన ప్రతి దెబ్బనుంచి పాఠాలు నేర్చుకొని అడుగులు ముందుకు వెయ్యడంతో అన్నను మించిన సక్సెస్ 2024లో రెడ్ కార్పెట్‌తో ఎదురొచ్చింది. ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించడమే కాదు.. ఏకంగా డిప్యూటీ సీఎంను చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి నూటికి నూరు శాతం సక్సెస్ సాధించిన రాజకీయ పార్టీగా రికార్డులు సృష్టించింది. అలా పదేళ్ల పాటు ఓపిగ్గా ఎదురు చూసినందుకు తగిన ఫలితం లభించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *