Medak Church: మెదక్ చర్చికి 100 ఏళ్ళు.. దీని నిర్మాణం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ..

Medak Church: మెదక్ చర్చికి 100 ఏళ్ళు.. దీని నిర్మాణం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ..

[ad_1]

ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పర్యాటక ప్రదేశం అయిన మెదక్ చర్చి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మెదక్ చర్చి శత వసంతాలు పూర్తి చేసుకుని ఉత్సవాలకు సిద్ధం అవుతుంది. మెదక్ క్యాథడ్రిల్ చర్చి అనేది ఓ అద్భుత కట్టడం..దీనికి ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా పేరుంది.. ఈ మెదక్ చర్చి 175 అడుగుల ఎత్తు..100 అడుగుల వెడల్పుతో కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ కళా నైపుణ్యాలు ఉన్నవారు నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం,శిఖరం.. వందేళ్లు పూర్తైనా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు ఆనాడు, భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. రంగు రంగుల గాజు ముక్కలతో, చర్చి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయడం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్స్‌లో కనిపిస్తాయి. విశేషం ఏంటి అంటే ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లండ్‌లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్య కిరణాలు పడితేనే కనిపిస్తాయి.

అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్యే ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుక ఉన్న సైన్స్ అందరినీ అబ్బురపరుస్తుంది..ఇక ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఉత్తరం దిక్కున ఉన్న మూడో కిటికీపై అసలు సూర్య కిరణాలే పడవు. అయినా, అది ప్రకాశిస్తుంది. ఇక్కడి రాళ్లపై సూర్య కిరణాలు వక్రీభవనం చెంది ఆ కిటికీపై పడటం వల్ల ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. చర్చి నిర్మాణంలో వాడిన మార్బుల్స్‌ను ఇంగ్లండ్, ఇటలీ నుంచి తీసుకొచ్చారు. చర్చి లోపల రీసౌండ్ రానివిధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతికి, పవిత్రతకు నిలయమైన ఈ కెథడ్రల్ చర్చ్‌కు ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ చర్చి నిర్మాణానికి కేవలం రాతి, డంగు సున్నాన్ని మాత్రామే వాడారు. పిల్లర్లు, భీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. 200 అడుగుల పొడవుతో సువిశాలమైన చర్చి చూపర్లను ఇట్టే కట్టిపడేస్తుంది. చార్లెస్ వాకర్ అనే ఇంగ్లాండ్ దేశస్థుడు 1914లో ఈ చర్చి నిర్మాణం ప్రారంభించాడు. అది మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయం. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో జనం సమిధలయ్యారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. పనిలేక.. తిండిలేక, బతుకుదెరువు కష్టమై బిక్కుబిక్కుమంటూ గడిపారు.

అలాంటి భయంకరమైన కరువు పరిస్థితుల్లో చార్లెస్‌ వాకర్‌ పాస్నెట్‌ కరుణామయుని కోవెల నిర్మాణం తలపెట్టారు. గుక్కెడు మెతుకుల కోసం అల్లాడుతున్న జనానికి ఇలాగైనా కాస్త పని దొరుకుతుందనేది ఆయన ఆలోచన. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 1924 డిసెంబర్ 25న పూర్తైంది. పదేళ్ల పాటు సుమారు 12 వేల మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలుపంచుకుని ఉపాధి పొందారు. ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదక్‌కు ‘మెతుకు సీమ’ అనే పేరు వచ్చిందని అంటారు..ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే, ఇప్పుడు ఇక్కడ అంత స్థలం లేదని చెబుతున్నారు. అప్పట్లో ఈ చర్చి నిర్మాణానికి రూ.14 లక్షలు ఖర్చు చేశారు. కొంత కాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు. క్రిస్మస్‌, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు.

ఈ చర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఇతర దేశాల నుంచి మెటీరియల్‌ను తెప్పించడం విశేషం..బ్రిటన్ నుండి మొజాయిక్ టైల్స్‌, ఫ్లోరింగ్‌ కోసం ఇటాలియన్ మెషన్లు తీసుకొచ్చారు. అలాగే యాష్ కలర్‌లో చెక్కిన భారీ స్తంభాలు గ్యాలరీతో పాటు మొత్తం భవనానికి పిల్లర్లుగా ఉన్నాయి. చర్చిపై కప్పును బోలు స్పాంజ్ మెటీరియల్‌తో తీర్చిదిద్దారు. దీంతో అది సౌండ్ ప్రూఫ్‌గా ఉంటుంది. ఇక 175 అడుగుల ఎత్తులో ఉండే బెల్-టవర్ కూడా చాలా దూరం నుంచే కనపడుతుంది.

ఈ కేథడ్రల్ చర్చి వెస్లియన్ మెథడిస్ట్, కాంగ్రిగేషనల్, ఆంగ్లికన్ మిషనరీ సొసైటీలతో ఏర్పాటైన దక్షిణ భారత దేశంలోని బిషప్ స్థానం కలిగిన చర్చి. మొత్తం 300 ఎకరాల్లో విస్తరించిన ఈ సముదాయం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇది గోతిక్ నిర్మాణ శైలితో నిర్మించడంతో సందర్శకులను ఇట్టే మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ కేథడ్రల్ చర్చిలో అతిపెద్ద ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే.. క్రీస్తు జీవితంలోని భిన్న దృశ్యాలను వర్ణించే స్టెయిన్డ్ గ్లాస్ విండోలు.. చర్చి లోపలికి వెళ్లగానే రంగు రంగుల్లో అందంగా ఉంటూ సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అక్కడ పశ్చిమ ట్రాన్‌సెప్ట్‌లో క్రీస్తు జననం, తూర్పు ట్రాన్‌సెప్ట్‌లో సిలువ వేయడం వంటివి చూడొచ్చు. దీంతో ఈ అద్భుతమైన కేథడ్రల్ చర్చిలో నిష్కళంకమైన హస్తకళలు కూడా ఉన్నాయి..ఇక్కడ ప్రతి ఏటా జరిగే క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులతో పాటు ఇతర మతస్థులు కూడా పెద్ద ఎత్తున్న వస్తారు.. ఇలా ప్రతి క్రిస్మస్ వేడుకలప్పుడు ప్రత్యేక శోభను మెదక్ చర్చి సంతరించు కుంటుంది. ఇక ఈ మెదక్ చర్చిలో ఎక్కడ లేని విధంగా కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం చూస్తాం..ఇక వంద ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఇప్పుడు వచ్చే క్రిస్మస్ వేడుకలు కూడా చాలా ఘనంగా చర్చి నిర్వాహకులు నిర్వహించాలని చూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *