Meal Maker Manchuria: ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..

Meal Maker Manchuria: ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..


ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఇష్టంగా తినే ఆహారాల్లో మంచూరియా కూడా ఒకటి. ఇది చాలా సాఫ్ట్‌గా, తియ్యగా, స్పైసీగా చాలా బాగుంటుంది. అందుకే చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి మరీ ఈ మంచూరియా తింటారు. ఇంట్లో ఉండే వెజిటేబుల్స్‌తో కూడా మనం మంచూరియాలు తయారు చేసుకోవచ్చు. త్వరగా ఈజీగా అయిపోవాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. పిల్లలకు నచ్చే స్నాక్ చేయాలి అనుకుంటే మీల్ మేకర్‌తో ఇలా మంచూరియా చేసేయండి. ఇది చాలా రుచిగా ఉండటమే ఉంటుంది. పిల్లలకు కూడా ఇష్ట పడి మరీ తింటారు. చాలా తక్కువ సమయంలోనే ఈ వంట చేయవచ్చు. మరి ఈ మీల్ మేకర్ మంచూరియా ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మీల్ మేకర్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు:

మీల్ మేకర్, సోయా సాస్, షెజ్వాన్ సాస్, టమాటో సాస్, వెనిగర్, మిరియాల పొడి, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వెల్లుల్లి, పచ్చి మిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, ఆయిల్.

మీల్ మేకర్ తయారీ విధానం:

ముందుగా గోరు వెచ్చని నీటిలో మీల్ మేకర్ వేసి ఓ పది నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత పిండి తీసి ఓ గిన్నెలోకి తీసుకోండి. మరోవైపు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ లోపు మీల్ మేకర్‌లో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా షెజ్వాన్ సాస్, నీళ్లు వేసి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేయాలి. వీటిని బాగా వేయించుకున్నాక తీసి మరో గిన్నెలోకి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరో కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అందులో వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చి మిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, మిరియాల పొడి, ఉప్పు, షెజ్వాన్ సాస్, టమాటా సాస్, సోయా సాస్ వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వెనిగర్ వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత చిన్న బౌల్‌లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి కడాయిలో వేసి అన్నీ మరోసారి మిక్స్ చేయాలి. ఇది మరుగుతున్నప్పుడు వేయించుకున్న మీల్ మేకర్ వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ మంచూరియా సిద్ధం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *