MCLR rates: బ్యాంకు రుణాలపై వడ్డీకీ ఓ లెక్క.. రుణగ్రహీతలను ఆదుకునే బ్రహ్మాస్త్రం ఇదే..!

MCLR rates: బ్యాంకు రుణాలపై వడ్డీకీ ఓ లెక్క.. రుణగ్రహీతలను ఆదుకునే బ్రహ్మాస్త్రం ఇదే..!


మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటునే క్లుప్తంగా ఎంసీఎల్ఆర్ అని అంటారు. దీన్నే రుణ ఆధారిత వడ్డీరేటు అని కూడా పిలుస్తారు. అన్ని బ్యాంకుల్లో ఒకే వడ్డీ విధానం ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకువచ్చారు. నిబంధనల ప్రకారం ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి ఏ బ్యాంకులు రుణాలు మంజూరు చేయకూడదు. రిజర్వ్ బ్యాంకు ఇండియా రెపోరేట్లకు అనుగుణంగా ఎంసీఎల్ఆర్ ను బ్యాంకులు సవరిస్తూ ఉంటాయి. 2024 డిసెంబర్ లో చాలా బ్యాంకులు ఈ రేటును పెంచాయి. మరికొన్ని రేటును పెంచకుండా పాతవాటినే కొనసాగించాయి. ఒక నిర్థిష్ట రుణం కోసం బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ వసూలు చేసే కనీన వడ్డీరేటును ఎంసీఎల్ఆర్ అంటారు. ఆర్బీఐ రెపోరేటు ప్రకారం బ్యాంకులు దీన్ని మార్చుతూ ఉంటాయి. ఈ నిబంధన లేకపోతే బ్యాంకులు ఎక్కువ వడ్డీని వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఖాతాదారుల ప్రయోజనం కోసమే దీన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రముఖ బ్యాంకులు అమలు చేస్తున్న ఎంసీఎల్ఆర్ ను తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకులో అన్ని కాల వ్యవధికి చెందిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు యథాతథంగా కొనసాగుతోంది. ఈ బ్యాంకులో ఓవర్ నైట్, ఒక నెలకు 8.20, మూడు నెలలకు 8.55, ఆరు నెలలకు 8.90, ఆటో లోన్లకు ఏడాదికి 9, రెండేళ్లకు 9.05, మూడేళ్లకు 9.10 శాతం వసూలు చేస్తున్నారు.

హెచ్ డీఎఫ్ సీ

ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్ డీఎఫ్ సీ స్వల్పంగా మార్పు చేసింది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ ను 9.15 నుంచి 9.20 శాాతానికి పెంచింది. మిగిలిన వాటికి పాత విధానంలో విధిస్తోంది. నెలకు 9.20, మూడు నెలలకు 9.30, ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లకు 9.45, మూడేళ్లకు 9.50 శాతం చొప్పున అమలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్యాంకు ఆఫ్ బరోడా

బ్యాంకు ఆఫ్ బరోడాలో ఓవర్ నైట్ కు 8.15, నెలకు 8.35, మూడు నెలలకు 8.55, ఆరు నెలలకు 8.80, ఏడాదికి 9 శాతం ఎంసీఆర్ఎల్ అమలు చేస్తుంది. ఇవి 2024 డిసెంబర్ 12వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.

పీఎన్‌బీ

పంజాబ్ నేషనల్ బ్యాంకు అన్ని కాలాలపై రుణాల రేట్లకు ఐదు బేస్ పాయింట్లు పెంచింది. ఆ ప్రకారం ఓవర్ నైట్ రేటు 8.35, నెలకు 8.45, మూడు నెలలకు 8.65, ఏడాదికి 9, మూడేళ్లకు 9.30 శాతానికి పెరిగాయి.

ఐడీబీఐ

ఈ బ్యాంకులో ఓవర్ నైట్ రుణాలపై 8.45, నెలకు 8.60, మూడు నెలలకు 8.90, ఆరు నెలలకు 9015, ఏడాదికి 9.20, రెండేళ్లకు 9.75, మూడేళ్లకు 10.15 శాతం ఎంసీఎల్ఆర్ ను విధిస్తున్నారు. ఈ రేట్లు 2024 డిసెంబర్ 12 నుంచి అమలవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *