Margshira Purnima: మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం కోసం ఈ పనులు చేయండి.. మీ ఖజానా నిడుతుంది

Margshira Purnima: మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం కోసం ఈ పనులు చేయండి.. మీ ఖజానా నిడుతుంది


హిందూ మతంలో పౌర్ణమి తిథి చాలా ముఖ్యమైనది, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పౌర్ణమి రోజున స్నానం చేయడం, దానం చేయడం చాలా పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పురాణాలు పేర్కొన్నాయి. అదే విధంగా పౌర్ణమి రోజున సత్యనారాయణుని పూజించడం కూడా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పౌర్ణమి తిథి ఉత్తమంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండకూడదని, లక్ష్మీ దేవి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటే మార్గశిర పౌర్ణమి తిధి చాలా పవిత్రమైనది.

లక్ష్మీ దేవి, శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందాలంటే మార్గశిర పౌర్ణమి రోజున కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ సంవత్సరం 2024 చివరి పౌర్ణమి డిసెంబర్ 15 ఆదివారం రోజున వచ్చింది. ఇది మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి.

మార్గశిర పౌర్ణమి 2024 తేదీ

పంచాంగం ప్రకారం మార్గశిర మాసం పౌర్ణమి తిథి డిసెంబర్ 14 సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిధి డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో డిసెంబర్ 15 ఆదివారం రోజున మార్గశిర పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ రోజు చంద్రోదయ సమయం అని పండితులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మార్గశిర పౌర్ణమి చంద్రోదయం సమయం సాయంత్రం 5.14 గంటలకు.. ఈ రోజున లక్ష్మీ దేవిని ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున లక్ష్మీ దేవిని పూజిస్తే, డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాదు ఈ రోజున కనకధార స్తోత్రం పటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

శ్రీ కనకధార స్తోత్రం

లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మార్గశిర పౌర్ణమి రోజున శ్రీ కనకధార స్తోత్రాన్ని పఠించాలి. సంపదల దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి తన ఆశీర్వాదాన్ని అందిస్తుంది.

వందే వందారు మందారమిందిరానందకందలమ్ ।
అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని ।
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం-
ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ ।
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి ।
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన ।
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి ।
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥

ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే ।
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 8 ॥

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-
మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే ।
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి ।
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥

శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై ।
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 11 ॥

నమోఽస్తు నాళీకనిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై ।
నమోఽస్తు సోమామృతసోదరాయై
నమోఽస్తు నారాయణవల్లభాయై ॥ 12 ॥

నమోఽస్తు హేమాంబుజపీఠికాయై
నమోఽస్తు భూమండలనాయికాయై ।
నమోఽస్తు దేవాదిదయాపరాయై
నమోఽస్తు శారంగాయుధవల్లభాయై ॥ 13 ॥

నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై ।
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥

నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై ।
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజవల్లభాయై ॥ 15 ॥

సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి ।
త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ॥ 16 ॥

యత్కటాక్షసముపాసనావిధిః
సేవకస్య సకలార్థసంపదః ।
సంతనోతి వచనాంగమానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే ॥ 17 ॥

సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 18 ॥

దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ ।
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథ-గృహిణీం-అమృతాబ్ధిపుత్రీమ్ ॥ 19 ॥

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితైరపాంగైః ।
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 20 ॥

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ।
గుణాధికా గురుతర-భాగ్య-భాగినో [భాగినహ్]
భవంతి తే భువి బుధభావితాశయాః ॥ 21 ॥

సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥

మార్గశిర పౌర్ణమి రోజున పూజలతో పాటు పవిత్ర నదిలో స్నానం చేయడం, పేదలకు దానధర్మాలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో శ్రేయస్సు, సంతోషం కలుగుతాయి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *