Manu Bhaker: ఖేల్ రత్న నామినేషన్లలో మను బాకర్‌కు దక్కని చోటు.. ఆమె తండ్రి రియాక్షన్ ఏంటంటే?

Manu Bhaker: ఖేల్ రత్న నామినేషన్లలో మను బాకర్‌కు దక్కని చోటు.. ఆమె తండ్రి రియాక్షన్ ఏంటంటే?


పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తరఫున రెండు పతకాలు సాధించిన యువ షూటర్‌ మను భాకర్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఖేల్ రత్న అవార్డు జాబితాలో మను భాకర్ పేరు లేదనే వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్, పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేర్లు ఖేల్ రత్న అవార్డు జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మను భాకర్ పేరు లేకపోవడంతో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ విషయంపై మనుభాకర్ కుటుంబం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై మను తండ్రి స్పందించాడు.

‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు’ భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం. హర్మన్‌ప్రీత్ సింగ్, పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్‌ల పేర్లను ఈ గౌరవానికి సిఫార్సు చేశారు. మను పేరు లేకపోయే సరికి అది వివాదంగా మారింది. అయితే ఈ వాదనను మను కుటుంబం తోసిపుచ్చింది. ఈ మొత్తం విషయంపై మను తండ్రి రామ్‌కిషన్ భాకర్ ఘాటుగా స్పందించారు. ముందుగా మను అవార్డు కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌ కూడా అవార్డుల కోసం అడగాలా?  అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమిటీ సభ్యులు తమ అభిప్రాయం చెప్పకుండా మౌనంగా ఉన్నారని ఆయన మండిపడ్డారు.మీరు ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారా? మేము అవార్డు కోసం దరఖాస్తు చేసాం, కానీ కమిటీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడుకోవడానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ప్రభుత్వంలో ఐఆర్‌ఎస్ అధికారులుగా వారిని ప్రోత్సహించాలని విరుచుకుపడ్డారు.

పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్  రెండు పతకాలు సాధించింది. ఈ 22 షూటర్‌ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్‌లో కాంస్యం సాధించింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి క్రీడాకారిణిగా మను భాకర్ నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *