Manchu Manoj: వారి తప్పు లేదు.. మోహన్ బాబు గాలి తీసిన మంచు మనోజ్..!

Manchu Manoj: వారి తప్పు లేదు.. మోహన్ బాబు గాలి తీసిన మంచు మనోజ్..!


మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. అయితే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల సమయంలోనే కవరేజీ కోసం వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు. టీవీ 9 మీడియా ప్రతినిధి రంజిత్ చేతిలోని మైక్ లాక్కొని విచక్షణ రహితంగా అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మోహన్ బాబు ప్రవర్తనపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి. సహనం కోల్పోయి మోహన్ బాబు రౌడీయిజం చూపించాడని.. బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మోహన్ బాబు వాంగ్మూలం తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాపై దాడి ఘటనపై మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

జర్నలిస్ట్ రంజిత్ దాడి ఘటన పై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన మనోజ్ నిస్సాయస్థితిలో ఉన్నానని.. అందుకే తానే మీడియోను లొపలికి తీసుకెళ్లినట్లు తెలిపారు. “మా ఇంట్లోకి నన్ను అనుమతించకపోవడంతో నేనే గెట్ తీసుకుని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్లాక నాపై దాడి చేశారు. నిస్సహాయ స్థితిలో బయటకు వచ్చి ఆ తర్వాత నేనే మీడియాను లోపలికి రావాలని పిలిచాను. ఇంటి లోపలికి మీడియా రావడంలో వారి తప్పు లేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో గత నాలుగైదు రోజులుగా మీడియాపై జరుగుతున్న అసత్య ప్రచారంపై క్లారిటీ వచ్చింది. మనోజ్ ప్రకటనతో మీడియా వాళ్లు తన నివాసంలోకి అక్రమంగా వచ్చారన్న మోహన్ బాబు వాదనలో పసలేదని తేలిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *