Malavya Rajyog in 2025: కొత్త ఏడాదిలో మీన రాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులకు చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే..

Malavya Rajyog in 2025: కొత్త ఏడాదిలో మీన రాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులకు చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే..


గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. దీని కారణంగా అన్ని రాశులు ప్రభావితమవుతాయి. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, స్థానం ప్రతి వ్యక్తి జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. జాతకంలో గ్రహాలు శుభ స్థానంలో ఉన్నప్పుడు, శుభ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు. అది వ్యక్తి జీవితంపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో జాతకంలో గ్రహాలు అశుభకరంగా ఉన్నప్పుడు.. అశుభం కలుగుతుంది. వ్యక్తి జీవితంపై ప్రభావం, సంపద, ప్రేమ, అందం, ఐశ్వర్యానికి బాధ్యత వహించే గ్రహం శుక్రుడు. 2025 సంవత్సరంలో శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశికి బదిలీ అవుతుంది. ఈ సమయంలో చాలా శుభప్రదమైన మాలవ్య రాజ్యయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారు వృత్తి, వ్యాపారాలలో లాభాలను పొందుతారు.

మాలవ్య రాజ్యయోగం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే

పంచాంగం ప్రకారం 2025లో శుక్రుడు తన రాశిని మార్చి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం శుక్రుడు .. శనీశ్వరుడు అధిపతి అయిన మకరరాశిలో ఉన్నాడు. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం జనవరి 28, 2025న శుక్రుడు తన ఉన్నతమైన మీన రాశిలోకి ప్రవేశించి మాళవ్య అనే రాజయోగాన్ని సృష్టించనున్నాడు. వేద జ్యోతిషశాస్త్రంలో మాళవ్య రాజ్యయోగం చాలా పవిత్రమైన యోగాగా పరిగణించబడుతుంది. సంవత్సరారంభంలో మాళవ్య రాజ్యయోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటంటే..

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారికి 2025లో శుక్రుడు రాశి మార్చుకోవడం వలన ఏర్పడే మాళవ్య రాజ్యయోగంతో అనేక ప్రయోజనాలు పొందే అవకాశం. ఎందుకంటే ఈ రాశికి అధిపతి దేవ గురువు బృహస్పతి. అందుచేత సంవత్సరారంభంలో రాజయోగం ఏర్పడడం వల్ల వృషభ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆస్తి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడితో కొంత లాభం పొందుతారు. మొత్తంమీద వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం చాలా శుభప్రదంగా ఉండబోతోంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: రాబోయే సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదమైనది. ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని శుభవార్తలను అందుకోనున్నారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి, లాభాలు ఉండవచ్చు. ఈ మాళవ్య రాజ్యయోగంతో ఈ రాశికి చెందిన వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు నెలకొంటాయి.

ధనుస్సు రాశి: మీనరాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ధనుస్సు రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఎందుకంటే ఈ రాశిలో నాలుగో ఇంట్లో రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన ధనుస్సు రాశి వారికి సుఖ, సంతోషాలు, సౌకర్యాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కూడా లభించే అవకాశం ఉంది. అంతేకాదు ఉద్యోగుల జీతం పెరగవచ్చు. కూడబెట్టిన మూలధన సంపదలో కూడా పెరుగుదల ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *