ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రయాగజ్‌లో ప్రారంభం కానుంది. మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. ఫిబ్రవరి 26న ముగుస్తుంది మహా కుంభమేళా జాతర. మహా కుంభమేళాలో గంగ నదిలో త్రివేణీ సంగమ క్షేత్రంలో స్నానం చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. మరీ ముఖ్యంగా మొత్తం మహా కుంభమేళా జాతర సమయంలో చేసే రాజ స్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి రాజ స్నానానికి విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు మహా కుంభమేళాలో నాలుగవ రాజ స్నానం ఎప్పుడు చేస్తారు? ప్రాముఖ్యత ఏమిటి? రాజ స్నానం చేసేందుకు శుభ సమయం ఎప్పుడు తెలుసుకుందాం..
మహా కుంభమేళా లో మొత్తం 6 రాజ స్నానాలు
మహా కుంభమేళా లో రాజ స్నానాలు మొదటి రోజునే అంటే జనవరి 13వ తేదీ పుష్య పౌర్ణమిన చేయనున్నారు. దీని తరువాత, 26 ఫిబ్రవరి 2025 న మహాశివరాత్రి రోజు వరకు మొత్తం ఆరు రాజ స్నానాలు చేస్తారు. ఈ ఆరు స్నానాలలో నలుగవ స్నానం వసంత పంచమి రోజున చేసే రాజ స్నానం. ఈ రోజు చదువు, విజ్ఞానం, కళ, సంగీతానికి దేవత అయిన సరస్వతి దేవికి అంకితం చేయబడింది. వసంత పంచమి నాడు నిర్వహించే నాల్గవ రాజ స్నానమ, తేదీ , శుభ సమయం గురించి తెలుసుకుందాం.. అలాగే హిందూ మతంలో వసంత పంచమికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
వసంత పంచమి రాజ స్నాన తేదీ, శుభ సమయం
ఈసారి వసంత పంచమిని ఫిబ్రవరి 3న జరుపుకోనున్నారు. అదే రోజు మహాకుంభమేళాలో నాల్గవ రాజ స్నానం కూడా చేయనున్నారు. మహా కుంభ మేళా సందర్భంగా వసంత పంచమి రోజున చేసే నాల్గవ రాజ స్నాన శుభ ముహూర్తం సాయంత్రం 5.23 గంటలకు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమవుతుంది. ఈ శుభ ముహూర్తం సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి
వసంత పంచమి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ప్రార్థన వల్ల సరస్వతి దేవి ఆవిర్భవించిందని చెబుతారు. దీని తరువాత మాత్రమే సర్వతి వీణ మధురమైన ధ్వని ద్వారా ప్రసంగం ప్రపంచానికి ప్రసారం చేయబడిందని నమ్ముతారు. హిందూ మతంలో సరస్వతి దేవి వాక్కు, సంగీతం,జ్ఞానానికి అధిష్టాన దేవత అని నమ్ముతారు. వసంత పంచమి నుంచి సీజన్ మారుతుంది. వసంతకాలం ప్రారంభమవుతుంది.
అత్యంత ఆహ్లాదకరమైన సీజన్
వసంత ఋతువు సంవత్సరంలో అత్యంత ఆహ్లాదకరమైన కాలంగా పరిగణించబడుతుంది. ఈ సీజన్‌లో పొలాల్లో పంటలు పువ్వులు పూసి అత్యంత మనోహరంగా కనిపిస్తాయి. అన్ని రుతువులలో ఈ ఋతువు అత్యంత సుందరమైనదిగా శ్రీకృష్ణుడు వర్ణించాడు. వసంత పంచమి రోజున అట పాటలతో డ్యాన్స్ చేస్తూ ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజున మహా కుంభ మేళాలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.