Maha Kumbhamela: కుంభమేళాలో కిన్నార్ అఖారాలే ప్రధాన ఆకర్షణ.. ఆశీర్వాదం కోసం పోటెత్తే భక్తులు.. ఎందుకంటే..

Maha Kumbhamela: కుంభమేళాలో కిన్నార్ అఖారాలే ప్రధాన ఆకర్షణ.. ఆశీర్వాదం కోసం పోటెత్తే భక్తులు.. ఎందుకంటే..


2025 జనవరి నెలలో మళ్లీ మహా కుంభమేళా నిర్వహించబోతున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో అన్ని అఖారాలకు చెందిన ఋషులు, సాధువులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని మహా కుంభ మేళా కార్యక్రమంలో పాల్గొంటారు. మహా కుంభ మేళా, కుంభ మేళా వంటి సందర్భాలలో సాధువులు, ఋషుల అఖారాలు తరచుగా వార్తల్లో నిలుస్తారు. కిన్నార్ అఖారా అనేది సాధువుల అఖారాలను పోలి ఉంటుంది. కిన్నార్ అఖారా కూడా హిందూ మతంతో ముడిపడి ఉంది. జునా అఖారాకు అధికారికంగా అనుబంధంగా ఉన్న మూడవ లింగానికి ప్రాతినిధ్యం వహిస్తోంది కిన్నార్ అఖారా. హిందూ ధర్మాన్ని పాటిస్తూ విగ్రహాలను పూజిస్తారు.

2019 కుంభ మేళాలో కనిపించిన కిన్నార్ అఖారా ఉనికి

2019 సంవత్సరం ప్రయాగ్‌రాజ్ కుంభ మేళా సమయంలో కిన్నార్ అఖారా ఉనికి కనిపించింది. కిన్నార్ అఖారా జునా అఖారాతో విలీనం చేయబడింది. 2019లో ప్రయాగ్‌రాజ్‌లోని కుంభ మేళా జరిగిన సమయంలో అన్ని అఖారాలతో పోలిస్తే.. కిన్నార్ అఖారాలో అత్యధిక జనసమూహం ఉంది. కిన్నార్ అఖారా సభ్యురాలు సాధ్వి సౌమ్య ప్రకారం.. అఖారాల సమాజంలో కిన్నార్ ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

దేశవ్యాప్తంగా మూడవ లింగానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న 13 రకాల అఖారాలు

సాధ్వి సౌమ్య ప్రకారం దేశవ్యాప్తంగా మూడవ లింగానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న13 అఖారాలు ఉన్నాయి. ఇందులో శివుడిని విశ్వసించేవారు కిన్నార్ అఖారాలు అయితే… విష్ణువును విశ్వసించే కిన్నార్ అఖారాలు అదే విధంగా సిక్కు గురువు గురునానక్ దేవ్ జీని విశ్వసించే కిన్నార్ అఖారా ఉన్నాయి. కిన్నార్ అఖారా పురాతన కాలం నుంచి ఉనికిలో ఉంది. ఇది రామాయణం, మహాభారతం అంటే త్రేతా మరియు ద్వాపర యుగ కాలంలో కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

సాధ్వి సౌమ్య ప్రకారం దశరథ మహా రాజుకు కొడుకు పుట్టినప్పుడు కిన్నార్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఆ పిల్లలను ఆశీర్వదించడానికి వెళ్ళారు. రాముని చూచి ఆశీర్వదించారు. ఈ పని ఇప్పటికీ కిన్నర్ సంఘం వారు చేస్తున్నారు. వీరి దీవెనలు ఇవ్వడం అంటే శుభం అని నమ్మకం. కిన్నార్ అఖారా సభ్యులు కూడా సనాతన పద్ధతి ప్రకారం ఈ పని చేస్తారు.

అందుకే కిన్నార్ అఖారా ఏర్పడింది

సాధ్వి సౌమ్య ప్రకారం కిన్నర్ సమాజంలో స్థానం కోల్పోయిన ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి.. కిన్నర్ల ఉనికిని మేల్కొల్పడానికి కిన్నర్ అఖారా ఏర్పడింది. హిందూ మతాన్ని ఇష్టపడడమే కాదు మతపరమైన ఆలోచనలచే ప్రభావితమైన వీరు.. 2019 కుంభమేళాలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రజలు కిన్నార్ అఖారాల నుంచి ఆశీర్వాదం తీసుకోవడానికి ఆసక్తిని చూపించారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *