Maha kumbha Mela: మహా కుంభ మేళాలో ఐదో రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం, చేయాల్సిన దానాలు ఏమిటంటే..

Maha kumbha Mela: మహా కుంభ మేళాలో ఐదో రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం, చేయాల్సిన దానాలు ఏమిటంటే..


వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో హిందువుల అతి పెద్ద జాతర మహా కుంభ మేళా పండుగ నిర్వహించనున్నారు. ఈ పండుగ జనవరి 13 నుంచి త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమవుతుంది. మహా కుంభ మేళాలో చేసే రాజ స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మహాకుంభంలో మొత్తం ఆరు రాజ స్నానాలు చేస్తారు. రాజ స్నానం జనవరి 13న పుష్య మాసం పౌర్ణమి రోజున ప్రారంభమై మహాశివరాత్రితో ముగుస్తాయి.

ఈ ఆరు రాజ స్నానాలలో ఒక స్నానం మాఘ పౌర్ణమి నాడు చేస్తారు. ఈ రాచ స్నానం ఏ తేదీ న వచ్చిందో.. స్నానం చేయడానికి శుభ సమయం..అలాగే హిందూ మతంలో మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

మాఘ పౌర్ణమి రాజ స్నానం ఎప్పుడు?

మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. మహా కుంభ మేళా జరుగుతున్న సమయంలో మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12న వచ్చింది. ఈ రోజు సాయంత్రం 5.19 గంటలకు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమై 6.10 గంటలకు ముగుస్తుంది. మాఘ పౌర్ణమి రోజున స్నానం చేయడం సాధారణ రోజుల్లో కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

మాఘ పౌర్ణమి ప్రాముఖ్యత

హిందూ విశ్వాసాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున దేవతలు భూమిపైకి వస్తారు. ఈ సమయంలో దేవతలు మానవ రూపాన్ని తీసుకుంటారు. మాఘ పౌర్ణమి నాడు, మానవ రూపంలో ఉన్న దేవతలు త్రివేణి సంగమం వద్ద స్నానం చేసి, ధ్యానం చేస్తాని నమ్మకం. ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే ఈ రోజున నదిని పూజించిన వారి కోరికలన్నీ నెరవేరుతాయి.

విష్ణువు అనుగ్రహం

హిందూ పురాణ గ్రంధాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి దానం చేసే వారిపై ప్రపంచ సృష్టికర్త శ్రీ హరి విష్ణువు అనుగ్రహం ఉంటుంది. ఈ రోజు స్నానం చేసిన వారికి శ్రీమహావిష్ణువు ముక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతారు. పూర్వీకుల అనుగ్రహం కోసం ఈ రోజున శ్రద్ధ కర్మలను కూడా నిర్వహిస్తారు. ఈ రోజున పేదలకు, ఆకలి అన్నవారికి దానం చేయడం ఫలవంతం అని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *